పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యందు వైశద్య మున్నది, ఏదో యొక రూపమున కవిత్వపు కలాయి ప్రత్యక్ష మగుచునే యున్నది.

     దాసుగారి సర్వసారస్వతమును పరిశీలింప నక్కర లేకయే వారి 'మేలుబంతి ' యను చాటు ప్రబంధమును, ఈ కచ్చపీశ్రుతులను జూచిన చాలు వరి యూహ పరిధిలోనికి రాజాలని వస్తుగని, వారి వాక్కుచే చైతన్యచకచ్చకితముగాని భావముగాని యుండబో దనిపించును. అంతర్ద్రష్టయైన కవి యూహ కగమ్యమైన దేముండును:   "ఈకవి: క్రాంతదర్శీ" అని కదా ఆర్యోక్తి.
 వర్ణనా వైదగ్ధ్యము:

    "నానృషి: కవి రిత్యుక్త మృషిశ్చ కిల్ దర్శనాత్
      విచిత్ర భావ ధర్మాంశ తత్త్వప్రఖ్యార దర్శనమ్॥
      వతత్త్వ్ దర్శనాదేవ శాస్త్రేను పఠిత: కవి;
      దర్శనా ద్వర్దినా చ్చాధ రూడా లోకేకవిశ్రుతి:॥"

అని కావ్యకౌతుక కర్త తౌతలిట్టు సేలవిచ్చినాడు. అనగా ఋషి కానివాడు కవి కాలేడు. దర్శనమువలన ఋషిత్వ మబ్బును. చిత్రవిచిత్రభావములను , ధర్మ సూక్ష్మములను గ్రహింపగల ప్రజ్ఞయే దర్శనము. తత్త్వదర్శనము కవి లక్షణములలో ముఖ్యమైనదని శాస్త్ర్రములు చెప్పుచున్నను అది వర్ణనా సహకృత మైనప్పుడే కవి శ్రుతి లోకవిరూడిని పొందుచున్నది. అందులకే--

   "తధాహి దర్శనే వ్యచ్చే విత్యే ప్యాదికవే ర్మునే:
     నొదితా కవితా లోకే యావజ్జాతా సవర్ణనా॥"

ఆదికవి వాల్మీకి యెంత అంతర్ద్రష్ఠయైనను ఆయన వర్ణనా నిపుణుడగు నంతకు కవితలోకమున ఆవిర్భవింపలెదు. మన ఆదిభట్టు ఎంతటిద్రష్టయో ఉపరి నిరూపించిరిని. ఆ ఋషికల్పుడు "వర్ణనా నిపుణ: కవి:" అను ఆబాణకమున కెంతపట్టు లక్ష్యబూతుడో పరిశీలింతము, వర్ణన యనగా రసభావ ప్రాంగణ రంగవల్లిక, దాసుగారు హరికధ చెప్పుచున్నప్పుడు సరేసరి అదియొక సద్యోహృద్య రసామభవ సమారాధన. ఆ సంతర్పణములం దెన్ని వర్ణనా వ్యంజసముల నెంత యెడుపుగా వడ్డింతురో చెప్పనలవికాదు. కనీస మమన్యూత కధాసూత్రముగల ఆయన కృతులను పఠించినను పఠిత యొకపాటి బావుకుడైనజాలు ఆ వర్ణనలవల్ల నగు కిట్టుబడి పదివేలు. ప్రకృత మీ 'కచ్చపీ 'యందలి వర్ణనలు కధాతంతువునుండి చూపిన విడిపూసలు. విడిపూనలేగని విలువకు మణిపూసలు.