పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లను సూచిందును). వారి యిష్ట మొక మతమునకు పరిమిత మైనది కాదు. సర్వమత సామరస్యమును, సర్వ మానవ ప్రపంచ సౌభ్రాత్ర, సహజీవనములను కంఠోక్తిగా కోరుకొనిది (1) పరిణామవాదమును విశ్వసించిరి. అయితేవ్ వానిని దశావతారము లలో ముడిపెట్టిన వీరి ప్రజ్ఞ ప్రశంసనీయము (4-5), పరిణామ వాదమున కట్టి సమన్వయము చేసిన వారిలో వీరేవ్ మొదటివారు. ఇది గజేంద్రమోక్షణ హరికధలో. తద్రచన 1886 లో నగుణోపాసనను సమర్ధించిరి. ఆ సమర్ధనమును సార్ధకము చేయుటకై వీరు ప్రతిపాదించిన ఔసమ్య మపురూపమైనది (5), ప్రభోధవేళ దాసుగా రొక ఉత్తమాచార్యులు. ధర్మదేవతాంశ వారి నావహించును. (9-11, 16-21). లోకము యొక్క నాస్తిత్వము గురించి చెప్పునపుడువారి కైవారమును గనుడు:-

      కం॥ కలిమి గల వాని - లేమిన్
            గలవాడెటు లాశ్రయించి కలిమి దెలుపునో
            తెలియుడు లేని జగం బిది
            యెలయన్ సర్వేకు నొద్ద నున్నటు తోచున్ (15).
      గీ॥ కలదనిన లేదు, లేకున్న గలదు జగము
            నభమునందున గన్పడు నల్సుమాడ్కి. (24)
          

ఏ రూపమునన్ కడకు యెజ్ఞరూపమునను పశుహింస పనికిరాదని వారి దృడవిశ్వాసము (30,31,36,38), విద్య గురించి యొక విశిష్టదృక్పధమును ప్రదర్శించిరి (42, 37) తన కాలేజీ అద్యాపకుల యెడ ఆయన ప్రకటించిన గురుభక్తిఅత్యపూర్వము (62-63), వీరి దేశభక్తి అనుపమానము (37, 44, 52) వీరి స్వరాజ్య కాంక్షకు, ఆదర్శస్వరాజ్య భావనకు ఆ శర్లావిగా నడచిన తారక కావ్య మంతయు తార్కాణయే. కళాకౌశలము గూర్చి వీరి యూహ లపురూపములు.

       "ఆటపాటలు మప్పుట కలవికాదు
         ముక్కు సెవులట్లు మెనితో బుట్ట వలయు"

నందును, పెద్ద లేర్పరచిన పడికట్లు మీరుటకు తాను తెగించితినని తెల్పిరి. భగవత్ర్పవక్తి లేవి కళాస్థితిని విరపించిరి. పరోపకారమే రాని పరమ ప్రయోజన మని యుద్గాటించిరి (46-49). వారి మహాభక్త హృదయమును పలుతావుల తిలకించి పులకించ వచ్చును కాని యొక ప్రత్యేకతకై 57-59, 60, 61, 72-73 పుటలు పరికించి పులకించవచ్చును కాని యొక ప్రత్యేకతకై 57-=59, 60, 61, 72-73 పుటలు పరిశీలింప దగును. అయీ సందర్భములందెల్ల భావమున నుదాత్తత యున్నది, భాష