పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

5.దశవిధరాగ నవతి కుసుమమంజరి: ఇది సంగీత ప్రపంచమున హనుమంతుని సముద్ర లంఘనము వంటిది. ఒక అపూర్వ కౌశల ప్రదర్శనం, 1938 లో దాసుగారు కన్యాకుమరి యందు అమ్మవారిని దర్శించుకొని ఆ పరమానుభూతితో పది వివిధ జాతు లలో తొమ్మిదేసి పంక్తులకు తొమ్మిదేసి రాగముల చొప్పున అనగా మొత్తము 80 రాగములలో అమ్మవారి పరముగ అన్వర్ధమగుట్లు రాగనామ నిర్దేశము చేయుచు సర్వతాశాత్మక పంచజాత్యేక తాళముతో నస్వరముగా విరచించిన దేవీస్తవము. ఆరోహణ క్రమమున సాగిన ఆ తొంబది పంక్తులు చక్కని సంస్కృత రచన. అనంతరము అవరోహణక్రమమున నస్వరముగ సాగిన తొంబది పంక్తులు మిశ్రభాషాత్మకములు. ఇందలి సంగీత ప్రక్రియను పరికించిన పలువురు తచ్చాస్త్ర విద్వాంసుల గడిదేరిన కైవామునకు ఆశ్చర్యచకితులైరి కాని అది యింతవరకు అచ్చుకాకపొవుట అస్మదాదుల కచ్చెరువు గొలుచున్నది. త్వరలో 'భాసభారతి ప్రచురణము ' గా వెలయగలదు.

6. మృత్యుంజయాష్టకమ్: రచన: 1908. అలబ్దము. రచన పకడ్బందుగా నున్నదనియు, వ్యాధిగ్రస్తులైన మిత్రులు తరచు దాసుగారిచే దీనిని చచివించుకొనెడి వా రనియు తెలియుచున్నది.

7. రామచంద్ర శతకము; ఇది 'రామచంద్ర ' మకుటము గల భుజంగ ప్రయత శతకము. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రబోదాత్మకమైనది. దాసుగారి అద్వైత వేదాంత జ్ఞానమునకు నికషదృషత్తుగ నున్నది. విషయము మహాగహనమైన తత్త్వమగుటచే భాషయందును బంధమునందును సారశ్యమునే కోరి ప్రదర్శించినారు దాసుగారు. ఇది 1921 నాటికే రచితపూర్వమైనను ఆ.నా. అముద్రిత గ్రంధ ప్రచురణ సంఘము వారిచే 1960 లో ప్రచురింపబడినది. ముద్రణ: శ్రీకృష్ణా పవర్ ప్రెస్ , విజయనగరము.

8. శ్రీహరి కధామృతము : ఇది శ్రీకృష్ణ జననము, పితృబంధ విమోచనము, దర్మసంస్థాఅనము అను మూడు హరికధల సంపుటి. 1913 లో కలకత్తాలో ప్రదమ కధాగానము చేసి విశ్వకవి రవీంద్రుని శ్లాఘాశిరకంతమునకు పాత్రులైరి దాసుగారు. వారి అబీష్ఠ సిద్దాంతములకు, వైదుష్య పరివాహమునకు, భక్తి బావుకతకు, లోకజ్ఞతకు తావలమైన కృతి. స్వీయకృతులలో వారి