పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

శైలిలో అలంకార చమత్కారచారువుగా సాగినది రచన 1914లో . ముద్రణ: 1921 ప్రాంతమున ప్రధమ ప్రచురణ జరిగినది. ద్వితీయ అ.నా.దాన అముద్రిత గ్రంధ ప్రచురణ సంఘము వారిది. కృష్ణా పవర్ ప్రెస్ ముద్రణ, విజయనగరము. 1968, లిపి తెలుగు.

3. చాతురెవర్గ్య సాధనం : దీనికే "పురుషార్ధ సాధనమ్' అని మారుపేరనుకొందురు. 1930 లో విజయనగరము శ్రీ వేదవ్యస ప్రెస్ లో అచ్చయిన దాసుగారి హరికధామృతము వెనుకతట్టు అట్టమీది ఇది సంస్కృత కృతి యనియు, అప్పటికే అచ్చయిన ట్లుటంకింపబడినది. కాని చిత్రము ఒక్క ప్రతియు నాబోటివానికి లభించినదికాదు. (260 శ్లోకములు గల తారకం వెల 5 అణాలు. దీని వెల 6 అణాలు. కాబట్టి ఇది మరికాస్త పెద్దగ్రంధమై యుండును).

4. తారకం : ఇది దాసుగారి గీర్వాణము తారస్థాయి నందుకొన్న అపూర్వ ప్రౌఢప్రయోగ వైచిత్రితో భట్టి కావ్యమువలె గండుమీరిన పండితుల గుండెలు తడవిచూచిన ప్రౌఢ ప్రబంధము. కావ్య ప్రారంభములో-- "పాణినీయసూత్రాణా మవైదికనా ముదాహరణ మేతత్కావ్యమ్"అని దాసుగారి ప్రతిజ్ఞ. అది నిర్వహించినది వారి ప్రజ్ఞ అయిదు సర్గలు, సుమారు 300 శ్లోకాలు. కధ చిన్నది, కల్పితము. కావ్యమున నున్న చమత్కార మంతయు కవితలోనే యున్నది గాని కధా సంవిధానమున లేదు. వారు హరికధలలో మరుమూల రాగము లనేకము వాడినట్లే యిందలి చతుర్ధ సర్గలో అన్యకవి ప్రయుక్తములు కాని విశేషవృత్తము లనేక ముపయోగించిరి. చందస్సు మీద వారికి గల ప్రభుత్వమున కిది యొక గుర్తు. నట్టి శాబ్దికమైన సాముగరిడీలే గాక లోకోత్తర వర్ణనలు కల్పనలు నున్నవి. అన్యాదేశ విన్యాసం, సారవత్సం దేశమును గలవు. "ఉపమా ఆదిభట్టన్య" అనదగిన ఉపమలెన్నో వారి సారస్వత సర్నాంగీణముగా నున్నట్లే యిందు నున్నవి. ప్రతి కృతియందు ప్రతిఫలించినట్లుగనే వజ్రి పూర్వ వ్యక్తిత్త్వ మిందును పలుతావుల ప్రతిఫలించి నది. రచన: 1968-10 సంజల నడుమ, ముద్రణ : విర్ణయసాగర ముద్రణాలయము, బొంబాయి. 1910 (జర్మనీలో మార్ బర్గ్ విశ్వవిద్యాలయ సంస్కృత శాఖాద్యక్షుడు ప్రొఫెసర్ కె.గ్తెల్ట్నర్ తారకకావ్యమును జూచి దాసుగరి కవితవు కడు గొనియాడుచు ప్రశంసా శ్లోకములు రచించి పంపెను.)