పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

తెలుగు పలుకులు, తెలుగులుగా భ్రమింపబడిన అన్యదేశ్యములు, నాటు తెలుగవునని కాదని వారు కగ్గమైన మాటలు-ఇత్యాది విషయము లెన్నియో బహుదాహరణములతో చక్కగా నిరూపింపబడినవి. ప్రకృతము 'అ ' నుండి.'కందు ' వరకు గల యొక భాగము మాత్రమే అ.నా.దాన -అముద్రిత గ్రంధ ప్రచురణ సంఘము, విజనగరము వారిచే 1967 లో ముద్రితమైనది. కడమ భాగము విజయనగరమున గలదని వినికిడి. (ఈ నిర్మాణకృషి: 1939-43)

ప్ర బం ధ ము లు

1.బాటసారి: ఒక తరము క్రిందట విశేష ప్రచరమునం దుండిన కావ్యరాజము. బహువాదముల విశ్వవిద్యాలయ పట్ట పరీక్షలకు పఠనీయగ్రంధము. అవిద్యావరణములో అవతరించిన మానవజీవితము ప్రజ్ఞానసిద్దివడసి సార్ధక మగుట యిందలి వస్తుతత్వము. ఇది యొక గొఢ వసుమయకావ్యము (allengorical poem) వేదాతపరమైన ఒక మహార్ధ వివేదన మిందు చతురస్రముగా సాగినది. ప్రసాదగుణ ప్రవణమైన మనోజ్ఞ రచన. దీని రచనాకాలమునాటికి దాసుగారికి 24 సం॥లు (క్రీ.శ.1888) పిన్నవయసు నందే హృదయ పరిపాకముగ్ల పెద్దరచన చేసిరి. వారి జీవితకాలమునందే పలు తడవలు ముద్రితమైనది.

2.మేలుబంతి: ఇది యొక పెద్ద చాటు ప్రబంధము. వివిధవిషయములపై తత్తద్వేకావిశేషముగా ప్రసరించిన దాసుగారి మనమునుండి బాహిరిల్లిన్ భావములు - దేవతలు, ప్రభువులు, మహావ్యక్తులు, విద్యత్ఫతంనులు, దేశము - నగరములు, సంగీత సాహిత్యములు, వర్ణనలు, హితోపదేశము, అనువాదములు, సంస్కృతమున శ్లోకములు, అందునిందు కీర్తనలు. ఇట్లు బహుభంగులుగా వేసిన వాలకము లిందు కాననగును. దాసుగారి హృదయమునకును నాటి తెలుగు దేశమునకును దర్పనారొషము వంటి దీ కృతి. ఇందును అచ్చ తెలుగు పద్యము లనేకము గలవు. ఎచ్చట వట్టిచూచినను దాసుగారి అచ్చ తెలుగు పై శవ్యనాసితము, అ తూర్పు కౌశల పేశలము. ఒక లఘుకృతిగా ఇది