పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

గలదు" అని. వాసుదేవుడు తమ హృదయమునే గాక వాక్కునగూడ ఆవేశించి యున్నరని కాబోలు దాసుగారి విశ్వాసము. ఆ సంఖ్యానిర్దేశము గూడ సాభిప్రాయముగ నున్నట్లున్నది. రచన : 1929.

ముద్రణ: శ్రీ వేదవ్యాస ప్రెస్, విజయనగరము -1929.

ఇందును దాసుగారి జాతక వివరములు గలవు

11.వేల్పునంద: "రెంట త్రాగుడు తిండి మెట్టంటు వేల్ప!" అను మకుటమున కర్ధము సింహాచలస్వామి నారాయణదాస స్వానుభవ మహాభాష్య మిది. వారి భక్తి భావ భండారమున కెత్తిన బావుటా, లోకజ్ఞతకు పట్టిన యద్దము. రచన: 1930. ముద్రణ: శ్రీ విద్యా ప్రెస్, విజయనగరము తొలికూర్పు-1935.

12.వ్యాస పీఠము: ఇందుపూర్వభాగమున ముద్రుతాముద్రితము లం దున లబ్ధములైన దాసుగారి వ్యాసములు 16 కలవు. అం దెక్కువ భాగము స్వగ్రంధపీఠికలు, అంతర్ద్రష్టయు, ఆలోచనా శీలియు, ఊహాశాలియు నగు దాసుగారి వైమర్శికదృకధ వైశిష్ట్యమును వారిందు చేసిన వివిధ జీవిత భాషాసారస్వత విషయసమీక్షణమున దర్శింప గలము. ఉత్తరభాగమున వారి హరికధ లన్నిట గల ఉత్తమ వచన రచన లేర్చి కూర్చితిమి. ఇందొక గొప్ప సారస్వతసౌరభముగుభాళించుచున్నది. వింర్శత్మక మైన ఉత్తరభాగమున కొద్దిద్ పాలును దేశ్యాంధ్రఘటికములు. నా సంపాదకత్వమున ఈ గ్రంధము జూలై, 1974 లో వెలువడినది.)

13.సీమపలుకువహి: ఇది యేక అపూర్వ నిఘంటువు - అచ్చ తెలుగు నిఘంటువు. ఇత: పూర్వమె నిఘంటువుల కెక్కని పదజాల మెంతో యిందు ఎక్కడి కక్కడ లెక్కదేలిన పర్యాయ వాచకము లన్నిటితోసహా యున్నది. మాతృభాషాయం దింత మమకారము, ఇంత్ ప్రభుత్ఫము, ఇన్ని మనను కాన్పులను గల సారసతప్రష్టను మరి చూడబోము. ఈ గ్రంధమునకు గల విపులపీఠిక మిగుల విలువైనది. విషయ గౌరవమునందేగాక పరిశోధనపాటవమునను దాసుగారి తోడా వైచునట్టిది. ఇందు తెలుగుభాష యొక్క స్వభావము, సంస్కృతముతొ దానికి గల భేద సాదృశ్యములు, సంస్కృత శబ్దములవలె గన్పట్టు తెలుగు నుడుపులు, తద్బవములుగా భ్రమింపబడిన