పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

ప్రామాణి దృష్టియు, సమన్యయ ప్రజ్ఞయు కడు శ్లాఘ్యములు. శాస్త్రీయములగు సంస్కృత పారిభాషిక పద జాలమునకు వారి తెలుగుసేత అత్యంతాశ్చర్యకరము. ఇది గద్య ఘటితము. పరిశోధన: 1939-43. ముద్రణ: శ్రీ వేదవ్యాస ప్రెస్, విజయనగరం -1961

8. మొక్కుబడి: దాసుగారు వివిధ ఋగ్వేద సూక్తములందు తమకు నచ్చినవానిని 300 ఋక్కుల నెన్నికచేసి వానిని వీణానాదనమున కనువగు నట్లు స్వరపరిచి అచ్చ తెలుగు పద్యములం దనువాదముగూడ వెలయించిరి. ఆయన విజయనగర సంగీత కళాశాలాధ్యక్షులుగా నుండిన కాలమున శిష్యుల కీ ఋగ్వీణానాద్నమున శిక్షణ నిచ్చుచుండెడి వారు. ఈకృతికే 'ఋకృంగ్రహ ' మని మరియొక పేరు. రచన: 1929. ముద్రణ: శ్రీ వేదవ్యాస్ద ప్రెస్, విజయనగరము - 1929.

(ఇందును దాసుగారి జాతకవివరము లిందు గలవు.

9. వెన్నుని వెయిపేర్ల వినకరి: 'విష్ణు సహస్రనామ ' సంకీర్తన మిది. ఆ నామముల కచ్చతెనుగున కించి ద్విపరణాత్మకమైన అనువదము. పద్యఘటితము.వివిధ పద్యముల ప్రసిద్దులైన సంస్కృత నామముల కిచ్చవచ్చిన మర్పున తెలుగు పేర్లు పెట్టిరి. తెలుగు లాక్షణీకులు చెప్పుటయేత్సప్ప తెలుగు కవు లెవ్వరును ప్రయోగించని అర్ధ సమనృత్తముల నుపయోగీంచిరి. ముద్రణ: సిటీ ప్రిమియర్ ప్రెస్, విజయనగరము, మొదటి కూర్పు -1927.

(ఇందును దాసుగారి జాతకవివరము లిందు గలవు.

10. వేల్పుమాట : భగవద్గీత యని దీనికి నామాంతర మున్నది. కాని దానికిది అనువాదముకాదు. మానస పుత్రిక మాత్రము దాసుగారికి దత్తపుత్రిక. గ్రంధ మంతయు 'బడి ' యను పేర మంజరియం దున్నది. చక్కని రచన,అతిగహనమైన తత్త్వముగూడ సుతిమెత్తని తేట తెలుగుపలుకుబడిలో నాటముగా అభివ్యక్తమైనది. దీని పీఠిక చివర దాసుగారి వ్రాయన మిట్లున్నది. "ఇరువదేడంకెలలో నెద్దియైన నొక యంకెను దలచుకొని యీ వేల్పుమాట పొత్తములో నెద్దియైన నొక పెడ తెఱచి మీదినుండి క్రిందివఱకు లెక్కింపబడిన యిరువదేడు బంతులలో దా దలంచిన యంకెగల బంతి చదువుకొన్నప్పుడు తాననుకొన్న పని యేమగునో నని యేమగునో తప్పక తెలియ