పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స బా ర తి

అచ్చ తెలుగు కృతులు

1. అచ్చ తెలుగు పలుకుబడి: ఇది మంజరీ ద్విపదలో బడి వద్దెముగా వ్రాయబడిన లఘుకృతి. అచ్చ తెనుగు ప్రాశస్త్యమును దానిపై దాసుగారి మమకారమును అభివర్ణించునట్టిది. ముద్రణ: మజనరంజనీ ముద్రాశాల, కాకినాడ -1928

2. ఉమరు కైయాము రుబాయతు: పార్శీ రుబాయతులకు, ఫిట్జ్ గెరాల్డు ఆంగ్ల పద్యములకును అనువాదము.

(వివరములకు 'అనువద ' శీర్షిక క్రింద జూచునది).

3. గౌరప పెండ్లి: హరికధ - ఉపరి ప్రవక్తము.

4. తల్లివిన్కి: లలితా సహస్రనామమునకు ప్రతి నామానువాదముతోడి వినృతి. పద్య గేయాత్మకము. రచన 19043-45. ముద్రణ: దాసభారతి ప్రచురణలు, గుంటూరు 1874.

5. నవరస తరంగిణి: ఇందు కాళిదాస శ్లోకములకు దేశ్యాంధ్రానువాదము గలదు.

(చూ. అనువాద శీర్షిక)

6. నూఱుగంటి : ఈనవు నీతికధల నొక మాటి నేర్చి కూర్చిన కృతి. బాలానబోదమునకై పద్య: ప్రసన్నమగు భాషలో గద్య ఘటిత మైట్టిది. ప్రతి కధాంతమునందును ఒక చిన్న పద్యమున కధాంశా పురస్కృతముగ నీతి ప్రవచనము నిపుణముగ చేయబడినది. ప్రతిపద్యము వద్యోహృద్య మగు నొక మరుచిర్ సూక్తి. దాసుగారీ నూఱింటిని మాఱు జ్ఞానక్షువులుగా సంభావించిరి. ముద్రణ: శ్రీ వేదవ్యాస ప్రెస్, విజయనగరంకు, రెండవ కూర్పు -1930.

7. మన్కి మిన్కు : ఇది ఆయుర్వేదమునకు సంబందించిన పరమాద్భుతమైన గ్రంధము. అధర్వసంహిత, కృష్ణ యజుర్వేద్ తైత్తిఈయారణ్యకము ఋగ్వేదీయ తైత్తిరీయారణ్యకము, ఐతరేయ బ్రాహ్మణము చాందొగ్యాద్యనేకము లుపనిషత్తులు దాసుగారి పరిశోధనకు విహారభూములైనవి. వారి శాస్త్రజ్ఞతకు, దేశ్యాంద్ర భాషాబిజ్ఞతకును శాఱోప్ల మీకృతి. వారి