పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

1913  : కాశీయాత్ర - అలహాబాదులో జానకీబాయి మెప్పు - కలకత్తాలో శ్రికృష్ణజననము హరికధ - విశ్వకవి రవీంద్రుని ప్రశంస.

1914 ; బందరులో వీనావదన ప్రజ్ఞకు చల్లపల్లి ప్రభువులచే గండపెండేర సన్మానము- కాశీ శతక రచన - (1908-1914 సం॥ల నడుమ దేశమున పలు తావుల హరికధా కాలక్షేపములు, ఘన సన్మానములు. నూజివీడులో పరిఢవించి సుబ్రహ్యణ్యయ్యను వీరఘాంటా వలయమునకు విప్పించి, పంచముఖీ పరమేశ్వరు డను బిరు దండుట.

1915 : భార్యా వియోగము - యదార్ధ రామాయణ రచన.

1919 : విజరామగజపతి సంగీతకళాశాల ప్రిన్సిపాలు పదవి నధిష్టించుట.

1921 : రామచంద్ర శతక రచన

1922 : పసుమర్రి కృష్ణమూర్తిగారి పార్వతీకల్యాణ యక్షగానము కృతివతిత్వము -'నవరస తరంగిణి ' ప్రకటన.

1923 : కాకినాడ కాంగ్రెసు మహాసభలో హరికధా కాలక్షేపము - సరోజినీ దేవి ప్రశంస లందుట- ఇంగ్లండులోని Empire Exhibition కు భారత సంగీత ప్రతినిధిగా ఆహ్వానము (కాని వెళ్లలేదు).

20-3-1924 : విజయనగములో షష్ఠిపూర్తి మహోత్సవము.

1927 : కి ముందు 'వెన్నుని వేయిపేర్ల విషకరి '(సిష్ణు సహస్ర నామ సంకీర్తనము) రచన.

1927 : మదరాసు అఖిల భారత సంగీత ప్రిషత్ర్భారంభోత్సవములో స్వదిరచితములైన 'స్వరాక్షర ' కృతులను పాది ఆచార్య పి.సాంబమూర్తి ప్రభృతుల ప్రశంస లందుట.

1928 : మదరాదు పుర ప్రముఖుల మహాసభలో హరికధలు చేసి "ఆంధ్రదేశ భూషణము" గా ప్రశస్తు లగుట.

1929 : 'అచ్చ తెలుగు పలుకుబడి ' వేల్పుమాట, 'మ్రొక్కుబడి ' రచన - విజయనగరములొ నవగ్రహాలయ ప్రతిష్ట.

1930 : 'వేల్పునంద ' 'హరికధామృతం ' ప్రచురణ, 'గొరప్ప పెండ్లి 'రచన