పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

అనుబందము.2

శ్రీ నారాయణ దాస

జీ వి త పం చాం గ ము

31-8-1864 : జననము(రక్తాక్షి శ్రావణ చతుర్దశి).

1869 : శివరాత్రి. స్వప్రజ్ఞయా భాగవత బహుమాన గ్రహణము.

1874 : సంగీతాద్యయనార్ధము వాసా సాంబయ్యగారితో బొబ్బిలి ప్రయాణము

1875 : తలిదండ్రులతొ కాలినడకను జగన్నాధ యాత్ర

1877 : సింహాచల యాత్ర. పితృవియోగము.

1880 : విజయనగరములొ ఆంగ్ల పాఠశాలా ప్రవేశము

1883 : హరికధావతారము. విజనగరము వేణుగోపాలస్వామి ఆలయములో ప్రధమ కధాగానము - 'ధ్రువచరిత్ర ' ర్చనము.

1883-85 : ఉత్కళదేశమున హరికధా యాత్ర - చత్రపురమున ఒక్కరాత్రిలో 'అంబరీషచరిత్ర ' హరికధారచన, మరునా డుదయమే ప్రదర్శన - లోక నాధము గ్రామమున మొట్టమొదటి సంగీత సాహిత్యాష్ఠావదానము.

1886 : మెట్రిక్యులేషను పరీక్షలో ఉత్తీర్ణత - విశాఖపట్టణమున రెండు నెలలలో పండ్రెండు హరికధలు - విజయనగరములో విక్టోరియారాణి జూబిలీకి ప్రభుత్వాహ్వానముపై హరికధాగానము - 'గజేంద్రమోక్షణ ' రచన - వివాహము - వీణా నాదనా భ్యాస ప్రారంభము.

1886-88 : విశాఖపట్టణమున F.A. చదువు - ఖాసింకోట జమీందారుగారివి రెండు హరికధలు చేసి మెప్పించి స్కాలరుషిప్పు సంపాదింఛుట. విశాఖలో 80 హరికధలు - అల్లిపురము జమీందారు హవేలీలో అనేకావధానములు - పిఠాపుర రాజ సన్మానము.

188-89  : బాటసారి కావ్యరచన - కాకినాడ నాటక సమాజము వారికి కాళిదాస 'విక్రమోర్వశీయ ' రూపక ప్రదర్శన శిక్షణ - రాజపాత్రధారణ - బందరు లో టికెట్టు పెట్టి సంగీత సాహిత్యాష్టావధానము - కొందరు సంగీత విద్వాంసులకు శృంగభంగము చేయుట.