పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సలలిత శృంగారమును సముచితముగ పోషించుటయేగాని తారాశశాంకకారుని వలె నెక్కడను ఇంచుకంత మేర మీరిన వారు గారు. సహజకవితాంజలి:

  "సహజ కవిత్వశాలి" గురించి చెప్పుచు వారు - ఏ వేదబలములు లేక కావ్య దోషముల నుజ్జగించి ఆనందోపదేశములు జనానీకమునకు కలునట్లు జగద్దితముగ కవిత చెప్పుననిరి.  "వింతవలె బ్రాత సంగతి న్వెల్లడించు" ననిరి (పుట 60). దానుగా రెక్కువగా చెప్పినవి ప్తాతకధలే. కాని ఆచెప్పుటలో ప్రతి వ్రత్న కధ యందు నొక నూత్న పరిష్కారమును జూపిరి.  అసలు కవితలో నున్న రహస్యమే అది:

          "దృష్ట పూర్వా పిహ్యార్ధా: కావ్యే రస పరిగ్రహాత్
           నర్వే ననా ఇవా భాంతి : మధుమాస ఇవ ద్రుమా:"

అవి అలంకారిక వచనము. సహజకవిత్వశాలి యనుటలో వారి యుద్దేశము Poet by temperament - అనగా "Iam a poet in sprite of myself" అని వక్కాణించిన బైరను మహాకవి వంటి వాడని. అసలాయనే ఆ సహజ కవిత్వశాలి. ఏ విద్యా విషయమునను గురువు లేనట్లే ఆయనకు కవితా గురువులును లేరు. ఆయనకు కళలకు భగవంతుడే గురువు. విజ్ఞతకు లోకమే గురువు. కవితకు హృదయమె గురువు. సహజ కవిత్వ మనగా నెట్లుండ వలెనో దాసుగా రెంత చక్కగా చెప్పిరో చూడుడు;

                       గీ|| సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగ కరణి
                           సాలె పురుగు కడుపులోని నూలు వలెను
                           దబ్బునన్ దొర్లిపడు కొందదార మాడ్కి
                          సహజ కవిత బయల్వడ్ నన్నుతి గను.( పుట.49)

ఆయనను లనుపమములు, సత్య వ్రత్యయ స్థాపనాచార్యకములు. ఎట పట్టి చూచినను ఆయన కవిత్వ మలవోక చెప్పినట్లుండును. సహజత్వ ముట్టి పదుచుందును. వ్యానపీఠముసజ్జ బాసికపట్టు వేసికొని గంటముతో కవితాకలకంఠికి గండకత్తెర వేయునట్లుండదు. స్నానశాలలో జలయంత్రపు తుంతుర్వని మేన త్రుళ్ళిన లాడినంత బయల్వెడలు కూపరాగము వలెనుందును. బహుజ న్మాంతరసాంద్ర సంస్కారబలమున ఆయన ఆలవోకగా చేసిన అదరస్పందనము లందును మధురిమలు