పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8

క చ్చ పీ శ్రు తు లు

నా మంచి తలిదండ్రు లేమఱి నీ వెడ
    వాకమున కొప్ప జాలరేమొ।

నిన్ను గానక నులియైన నిల్వనోప
మించి పోనీకు నన్ బ్రతీంచు వడిగ
నేల జాలము నన్నిక నేలుకొనుము
కడలి మిసిమి తాల్ప! కను మంగమొల నేల్ప!

గౌరప్ప పెండ్లి

8. హిరణ్యాక్షుడు:

సీ॥ నీలి కొండన్ బోలు నెమ్మేన దొగరు రు
        న్పటి నంజరెంజాయ నగరి మెఱయ
     సప్రభాసానలజ్వాల లనంగ నొ
        దల మ్నీరి నల్లజతలు వెలుంగ
    నఖిల జగజ్జయ ప్రాప్ర కీర్త్యంతురా
        కారత వెలపంకకోర లలర
   నోలి మస్పిరిగొన్న యుక్కుదూలమ్ము ల
        నదగు చేతుల బెద్ద గద చెలంగ్

    ధరణి యడుగుల కదర నమరులు బెదర
    'రిక్కులన్ గెల్చి వచ్చెద దీవన లిడు
     మన్న!' యని నాకు మ్రొక్కి స్వర్ణాక్షు దేగ
     ననుజుని న్మళ్ళి గన నోచనైతి నకట!

--ప్రహ్లాద చరిత్రము