పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
2

దా స భా ర తి

3.మద ద్విరదము :

లయగ్రాహి

  చారుగతి నొడ్డునకు జేరుకొని వృక్షముల
      ఘోరముగ లాగి జలపూరమున గంతున్
  దోరమగు తొండమున నీరమును బీల్చుచు గ
      భీర విసదంబు పయిమీఱ నెగ జిమ్మున్
  బోరున మునింగి సయి మీఱు తన చేత నొక
     నీరగము బట్టి పొలుసారగ నటించున్.

4. నక్ర విక్రమము :

సి॥ భూరి భూత్కార సంభూత గంభీర గుం
         భ ద్వానమున శైలపంక్తి నడక
    దారుణ వాల సంతాడనోద్దూత తో
        య కణంబు లంబన మంటికొనగ
   పతుల హింతల త్వగంచిత దేహ నం
      గతి జలజంతు శోణితము వాఱ
  ఖర ముఖర నఖర వ్రకర కంవనంబున
     గొలను సర్వమును బంకింలము గాగ
  
 పొంచి మైపెంచి కుప్పించి పొంకరించి
 యొక్క మకరీందు డిభరాజు నొడిసి వట్టి