పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆని వారి వక్కఱ (చూ.కచ్చపి-పుట 49). కావ్యము లోక మంతటిని లోగొనగలదనియు, కవి వేదమూర్తియైన భగవంతుని వంటి వాడనియు అనగా అతడొక మహారష్టయనియు, కవికిని కావ్యమునకును గల యనుబంధ మనినా భావమనియు అనగా కావ్య మతని అంతరంగ సంతాన మనియు బావము. అంతటి ఆకాశములో లోకబాంధవు డనిపించుకొన్న వాడెట్లు ఏకైక వ్యక్తిగా రాణించుచున్నాడో అట్లే లోకములో ప్రతిభావంతుడైన కవి యొక్కడే పరమ విశిష్డుడుగా పరిగణింపబడుననియు, చతుర్విద పురుషార్ధములకును కావ్యమే ఏకైక సాధన మనియు, సంగీతము పుష్పమైతే సాహిత్యము తత్వరాగ మనియు, ఆస్థికతయే ఫలమనియు కైవల్యమే తద్రవ్ మనియు దాసుగారి యభిప్రాయము (చూ.పుట 49). మరియొకచో ఆయన సత్కవి యొక్క ఆంతర్యము నిట్లు సంభావించిరి. అతడు సర్వరసాత్ముడు, సర్వభూతమయుడు, పరవశ సుఖయోగుడు. చిత్ర సంకల్పభోగుడు, దైవాధీన మన: ప్రవృత్తి గలవాడు గాక స్వతంత్ర రచనానిపుణుడు, దయార్ధ్ర చిత్తుడు, సత్య నిష్ఠ్రుడు, కళాచణుడు అని (చూ.. పుట 79). కవి యన్నను, కావ్య మన్నను ఇంతటి సముదాత్త భావన చేసిన అంతర్యాలు లరుదు. సత్కవి లక్షణము లన్నియు ఆయన తనలోనికి తాను తొంగి చూచుమొని చేసిన నిర్ధేశములే యూని ఆయన నెరిగిన వారందరు గ్రహింపగలరు. సత్కవి తన కావ్య దర్శమున సర్వపదార్ధములను విశకలితముగా ప్రతిఫలింప జెయగలడు. అతని వలె లోక కల్యాణ కరణ్ మన్యుల కసాధ్యము, ఎంత ప్రతిభను ప్రదర్శిచి శైలీలాలిత్యము జాలువార ఎంత రసవంతముగా చెప్పి నను "తారాశశాంకము" వంటి కావ్య మనతావ్యమే యగుననియు వారి ఆశయము (చూ.పుట. 50). ఆశయముకాదు ఆచరణము. తమ పలుకృతులలో వర్ణనల రూపముగను ఉపమద్యలంకాముల రూపముగను, విషయగతముగా తగిన సందర్భములు వచ్చినప్పుడు సరేసరి, ఎన్ని లౌకిక విషయములను వాని ప్రాణస్నాయువులను బట్టి పరిశీలించిరో చెప్పలెము. తమ హరికధాదిక కృతులలో భక్తిసుధలను సూక్తిసుధలను నిక్షేపించుట కాదు దేశమంతయు తిరిగి తిరిగి ఊరూర వాదవాడల హరికధా కాలక్షేపములు సేయుచు నడుమ నడుమ సందర్భములు కల్పించుకొని భగవద్భక్తిని, దేశభక్తిని, సమాజ విమర్శను, భారతీయ భవ్యధర్మనును తన జన్మ కర్తవ్యముగ బావించి ప్రచారం చేసినారు రామదాసుగారు, 8-8-1933 న విశాఖపట్టణమున జరిగిన యొక మహాసభలో "శృంగార సర్వజ్ఞ" బిరుదు ప్రదానమున కర్హులైన దాసుగారు తమ కృత్లందు