పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

85

క చ్చ పీ శ్రు తు లు

N. That man that hath a tongue, I say, is no man
    If with his tongue he cannot win a woman.
        [Two Gentlemen of Verona- Act III, Sc.i]

ద్వి॥ మాటాడువా డెల్ల మగవాడుకాడు
       మాటలచేత బామల గెల్వకున్న.

O.What seest thou in the ground? hold up thy head:
   Look in my eyeballs, there thy beauty lies
   Then why not lips on lips, since eyes in eyes?
     [Venus and Adonis.]

గీ॥ ఎందు కటు క్రిందు జూచెద నెత్తు సిరము
    చూడు నా కంటిపాప లచ్చొటను నీదు
    సొగసు నెలకొను -జూపుల జూపు లెనయ
    నేల పెదవులు పెదవుల నెనయరాదు?

P. Men are April when they woo, December when they wed;
    maids are May when they are maids,
    but the sky changes when they are Wives
           [As You Like It -Act IV, Sc.i]

న॥మగవాండ్రు తము బెండ్లాని కన్నియల
    బతిమాలుకొను నప్పుడు చైత్రమాసమువంటివారు.
    కాని పెండ్లియైన పిదప శూన్యమాసమువలె నుందురు:
    కన్నియలు తమ కన్యాత్వమందు వైశాఖముం బోలెదరు.
    కాని వా రిల్లాండ్రైన పిమ్మట నా కాలముమాఱును

Q. But virtue, as it never will be moved
    Though lewdness court it in a shape of heaven
    So lust, though to a radiant angel linked,
    Will sate itself in a celestial bed
    And prey on garbage.
                    [Hamlet - Act I, Sc.V]

గీ॥ అలమి పోకిరితనము స్వర్గాకృతి గొని
     కోరిన జలింపబడదు సుగుణ మొకప్డు