పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రములు వేరువేరు. అట్లే యైనది ఆదిభట్ల వారి సంగతి. కవిత కారు వారి ప్రధాన కర్మ క్షేత్రము. హరికధ వారి జీవిత సర్వస్వము. గ్రంధపరికల్పనసముద్దేశము:

     వారి 46 కృతులలో 14 హరికధలు (14 సంపుటములు- 21 కధలు) హరి దాసులు వల్లె వేసి కొనుటయే గాని వానికి సాహిత్య జగత్తున పఠన పాఠనములు లేవు. 13 అచ్చ తెలుగు కృతులు. ప్రాచీనములైన అచ్చ తెలుగు కృతులే తెలుగు వారి కచ్చివచ్చినవి కావు. ఒక యెనిమిది కృతులు కేవల సంస్కృత భాషా ఘటి తములు. అన్యుల గీర్వాణమమునకును హర్షించు ఆంధ్రులు తమ సంస్కృతము నెందులకోగాని అంత వరకు సేయరు. మిగిలిన వానిలో సుమారేడు అనువాదములు. సంసృతము నుండి చేసిన తెనిగింపులను దాసుగారు అచ్చ తెలుగుననే వెలయింతురది వారి శపధము. కాకున్న ఆదినుండి అనువాద సాహిత్యమున కలవాటు పడిన మనవారు కనీస మీకృతుల నైన కాతరు చేయ కుందురా ? ఆయా కారణములచే దాసుగారి సాహిత్యమునకు రావలసినంత పేరు ప్రతిష్ఠలు రాలేదు.  కాని ఆ హరికధలలో అపురూపమైన కమ్రకవితా గానముకదు. ఆ అచ్చ తెలుగు కృతులలో వెనుకతి కృతుల కంటెను నెక్కవమైన నియమ మున్నను అతిమాత్రమైన హృద్యమైన వైశద్య మున్నది.  సర్వ పూర్వాంధ్ర ఫ్రౌఢ ప్రాబందికుల గాఢపాక మగు సంస్కృతమునకు లేని దని యున్నది. ఆ సంసృతము కృతులలో కింకుర్వాణ గీర్వాములైన ప్రయోగ విశేషములు గలవు.  కాళిదాస కళాకౌశలము గలదు కాదంబరీ స్వాదుత్వం గలదు. పండిత శుండాలముల శ్లాఘా శిర: కంప సమర్హ సామగ్రి గలదు. ఆ యనువారములు మూలము మాలిమిని డక్కగొన్న వయ్య స్వతంత్ర కృతి ప్రతి పత్తిని గల్గి నట్లు కౌశల పేళలములై యున్నవి. ఆ యీ యోగృతం కన్నిటికిని తగిన తార్కాణగా ఇదిగో గ్రంధ మిక్కడనే యున్నది.

గ్రంధ స్వరూపము:

    ఈ గ్రంధ మొక సంకలనము. దాసుగారి కవితా సుమారామ మధుకోశము. ఉపలబ్దములగు వారి కృతులను సప్తదా విబాగించితిని--హరికధా సారణి, కావ్య సారణి, శతక సారణి, రూపక సారణి, అచ్చిక సారణి, సంసృత సారణి, అనువాద సారణి యని, ఒక్కొక సారణియందు ఆ యా తరగతుల కృతులనుండి సందర్భ నిరపేక్షముగా సరసార్ధ వ్యక్తిగల చక్కని కవితాంశగల పద్యముల