పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66

క చ్చ పీ శ్రు తు లు

88 ఋతానృతవై:

గీ॥ వెనరు, దిట్టతనము, నోర్చు, నిర్మలతయు,
     నిశ్చలతయు, దటస్థత, నియమితగతి
     జెందు దృష్టియు, సుష్మితమందవాక్కు
     సత్యవంతుని యాన్యలక్షణము లివ్వి.

గీ॥ దొంగతనము, సిగ్గు, వెంగలితనమును,
      పగలసెగలు పొగలు, వలపుసొలపు
      గొలువు కన్నుగనయు, గొంటెనవ్వుల మాట
      కల్లబోతుల్ ముఖము వెల్లడించు

89. కళాఖళూరిక :

సీ॥ చిఱుణాలపై జిలజిల రాలు సెలయేటి
           నీటిపై లకుముకి రాటు చూచి
     నానాట నలవాటు బూని మెల్లను జేర
           వచ్చు జింకల కూర్మిపాలు చూచి
    మడుగుల జెఱలాడి వెడిదవు బొడ్దుల
          బోలయించు నేనుగుపోటు చూచి
    దువ్వి ముద్దుగొనుచు దొడ్డ పులులతోడ
         నాలాడు చెంచెం నీలు చూచి

   వర్ణనము సేయుచున్ భూరినవములందు
   బలురకంబుల పిట్టల పలుకులకును
   స్వరముగట్టుచు జెట్టుల పట్టలందు
   బద్యములు వ్రాయు భాగ్యంబు పట్టు నెపుడు