పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Prof. S. V. JOGA RAO M.A. ph.D.

Head. Tel. Dept.. A.U.P.G. Centre, Presidnet, Guntur Dt. Wrters' corp. Society, [Formerly Professor, Leningrad University]

                        సంపాదకీయము

ప్రరోచన:

    ఒక పుంభావ సరస్వతి ఒక బహుముఖ సారస్వత ప్రపంచ విరించనుడు విని పించిన కవితాకళా కల విపంచీ ముఖ వికస్వర స్వరమ్లను విని పరవిశించిన యొక మహాభాగ్యశాలి మధురహృదయ స్పందనము లీ పలుకులు.
   సంగీత సాహిత్యము లా మహామహుని యుచ్చ్వాస నిశ్వసములు, భక్తి దేహము, భావము దేవుడు, రిజజ్ఞత రూపము, బ్రదుకంతా యొక సుదీర్గ హరికధ. కృత ప్రతి హరికధాకాలక్షేపము సకల కలా విక్షేపము, సరసవతి పేరోలగము. అవడాయన్?ఇంకెవడు! రసవజ్జీవిత మహేతిహాసుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాసుడు..అన్నివిద్యల కాచార్యపీఠమైన ఆయనకు గురువు లేడందురు. లేకేమి! జగద్గురువైన భగవంతుని అంతేవాసియైన ఆయన కలవడడని కళ లేదు.  సాధ్యముకాని విధ్యలేదు.

దానభారతి:

   జీవితము నొక కాలక్షెపముగా గాక ఓక్ కఠోర వ్యాసంగముగా ఒక కళాకేళిగా ఒక మహతపస్సుగా ఒక మధురానుభవముగా గడచిన మహాబగు డతడు. అతని పండిన గుండెనుండి హాహిరిల్లిన దొక బహుఖీన సాహిత్యము అందు శ్రవ్య డృశ్య కావ్యములు గలవు.  హరకధలు గలవు. హరికధలుగలవు. శతకములు గలవు. వ్యాసములుగలవు. విమర్శలు గలవు. పదపద్య గద్యములు వేసిన వాలకము లనేకముగలవు. బహు వైదుష్య ఫలములు గలవు. కాని చిత్రము. అంతటి సారస్వత మహాస్రష్టకు అంతటి కవితాంతర్ద్రష్ఠకు హరికధా పితామహుడుగా మాత్రమే పేరు మిగిలినది. అది శంకరు డంత మహాకవియా, వివేకానందు డంత విశ్వకవియా కాని చివరికి ప్రఫక్తలుగా మాత్రమే వారు లబ్ద ప్రతిష్ఠులైరి.  ఒక అన్నమయ్య, ఒక క్షేత్రయ్య, ఒక త్యాగయ్య-కవితా సరస్వతీ కళాస్థానము లంటిన వరసాగ్రేసర చక్రవర్తులయ్యు వీరు మిగిలిన వాగ్గేయకారులుగా మాత్రమే వాసికెక్కిరి. కవి చరిత్ర గ్రంధము లందు వారి పేరులు కానరావు. ఏం? వారి వారి ప్రధాన కర్మ