పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

61

క చ్చ పీ శ్రు తు లు
17. మృత్యుంజయ శివ శతకము
 [దసుగారికి జీవితమునను కళారంగ వ్యాసంగమునను నిత్యానసాయియైన సహచరునిగ నుండి ఆయనను కంటికి రెప్పవలె కాపాడుచు అవసరమగుచో కర్రపెత్తనము చేయుచు తన యావజ్జీవితము ఆయనతో హరికధలలో పాటకచ్చేరీ లలో సహకారాగానముచేయుచు పెద్దపెద్దపండితుల పేరోలగములలో సెభాషనిపించు కొన్ని గాంధర్వధూర్వహుడు పేరన్నగారు- ఆయన కన్నగారు. వారి అనుబంధము జన్మాంతర సౌహార్ధ బంధురము. ఆ అన్నగారు మృత్యుముఖద్వారమున బడినప్పుడా ప్రక్కనే ఆర్ద్రనయనాలతోనున్న దాసుగారి ఉద్విగ్న హృదయమునుండి ఆలవోకగా ఆశువుగా బాహిరిల్లిన దీ శతకము. అయింతా పేరన్నగారు బ్రతికి బట్ట గట్టిరి. తదుపరి పెక్కేండ్లు దాసుగారి నిర్యాణానంతరమును జీవించిరి.]

79. సహోదర సౌహార్ధము:

కం॥ భోగముల గోర నొల్లము
      భోగీశ్వరభూష! బ్రతుకు పొడిగించినచో
      నీ గానము సంతుష్ఠిగ
      బాగుగ ప్రకటింప నానపడితిమిర శివా!

కం॥ జోడుగ నీడగ దోడుగ
      వేడుకతో శ్రుతుల మేళవించుచు నిన్నుం
      బాడి కసి దీర్చుకొందుము
     వేడెద మాజంట జెందు పెక్కేండ్లు శివా!

కం॥ ఆశ్రితులం నీ కీర్తన
       కే శ్రమ ప్రాణంబు లనక యెల్లదెసలు రా
       గాశ్రితములుగా గనగా
       మిశ్రలయల బాడ జీరము మెలగించు శివా!

కం॥ నే బ్రితికిన సార్ధక మే
       మీ, ఋణములు కాళ్లు కనులు మెడ లెనట్లో
       నాబ్రతుకు, జంట నలరం
       గాబ్రోచిన నిన్ను వాడి కడగందు శివా!