పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
52
దా స భా ర తి

69. మశకమాధవము :

శో. చక్రభ్రమణకరత్యా త్కుదృష్టినిర్దూరం వర్జ్యమావత్వాత్
       శ్రుత్యస్త ఖేలసత్వాత్ మశక: త్వామేవ మాధవం మత్యే.

70. దేశభక్తి ప్రబోధము :

ఆ॥వె॥ మనదు శక్తి యొకమత్య్హము బొందక
          యంత సగతునైన నడుచుటెట్లు
          లెన్సునందు బడక రెండుజాముల యెండ
          కడగి దూదినైన గాల్చగలదె:

గీ॥ మీసములు రోసములు గల మేని మనది
        ఇళ్లు వారిళ్లు పైపాటు లెల్ల మనవి
        ఆటలుం బాటలుం బలుగోటు మనవి
        కాని మన తల్లిదేశము కాదు మనది

71. కఱవు :

కం॥ త్యాగము చెడె బేదలు కా
       రాగృహము న్దిండికై దొరన్గడగిరి, బర్
       తీగలు చెట్లు న్మాడెన్
      క్రాగిన చమురువలె నెండ కాయుచుండెన్

కం॥ అంగనలకు శ్రమ మయ్యెన్
      గంగాధరులకును మిగుల గర్వం లయ్యెన్
     రంగుచెడె స్నాననిష్టలు
     ఎంగిలి భాండముల బది యిసుకయెచేనన్