పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

47

క చ్చ పీ శ్రు తు లు

ఆటపాటల చవిలెని మోఘకొయ్య
కయ్యమునకు మున్ముందుగా గాలుదువ్వు
ఉబ్బర న్మెక్కి యందల మసురుపెట్టు
నెల్లరికి లేనిపోని తప్పెన్నుచుండు॥

గీ॥ ఆటపాటలు ముప్పట కలవి కాదు
     ముక్కుసెవులట్లు మేనికో బుట్టవలయు
     మొద్దురొదవాలకము తోలుబొమ్మలాట
     వెక్కిరింపులల్ల రిమూక-వింతజోక॥

మూపు॥ చచ్చినవారల మెచ్చు
           న్మచ్చిక బ్రతికున్నవారి మఱుగున బుచ్చున్
           వచ్చి యవిటి యెరు సన్నిక
           నచ్చొత్తింపించి తనదె యని చాటుకొనున్॥

అ॥వే॥ అందమైన జవలి మందికుతుకల లే
          దటులగాన నెమల్కియాలపోతు
          చింజి బాతు, మావిచిగురు మేపరి, తేజి,
          యేన్గు గొంతుక లెడె యెన్నవలసె॥

అ.వె. ఎఱ్ఱచీర జూచి వెఱ్ఱి యెనలు బెట్టి
        పరుగు లిడుచు నార్చు బఱ్ఱెవోలె
        ప్రతిభజూచి యోర్చు ప్రాజ్ఞత లేమి పై
        కుబ్బి శ క్తిహీను లుల్కుచుండ్రు.

తే॥గీ॥ ఎల్ల రెవరంతవారు వా-రెందునైన
         నొక్కొకని కొక్క నేరువు-దక్కియుండు
         నిండుచూపున గొఱవడు నీల్గుబోతు
        తన్నుదా మెచ్చుకొనుచుండు-నమ్నవలను.