పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 99

చిన్నయసూరిగారు హయగ్రీవలక్ష్మీ మంత్రో పాసకులు. వా రనవరత మీమంత్రములను పఠించెడివారు. ఇప్పటి పండితులవలెఁ గాక వారు మిక్కిలి నియమముతో తమతమ ధర్మములను విధ్యుక్తముగా నాచరించువారు. వీరు వైష్ణవధర్మాను సరణముగ భక్తిశ్రద్ధలతో భగవన్నామమును జపించెడివారు. వీరియొక్క వేషభాషలనుగూర్చి ప్రసిద్ధపండితులు ప్రభాకరశాస్త్రిగా రిట్లు వ్రాసియున్నారు: "చిన్నయసూరి స్ఫురద్రూపియై సన్ననిలాల్చీని ధరించి శుభ్ర వస్త్రములతో కన్పట్టు వాఁడు; కండ్లకు సులోచనములను ధరించెడివాఁడు. ప్రతిదినము స్నానమునకు వెనుక నేదైన నొక భాషాప్రయోగమును క్రొత్త దానిని చూడకయే భోజనమునకు లేచెడివాఁడు కాఁడని ప్రతీతి. ఇట్టి నియమముతో భాషాపరిశ్రమచేయుటఁబట్టియే చిన్నయసూరి రచనములు శాశ్వతములై యొప్పారుచున్నవి."

చిన్నయసూరి విష్ణుభక్తిపరుఁడై తనగ్రంథములన్నిటిని శ్రీవేంకటేశ్వరస్వామికి కృతినొసంగెను. బాలవ్యాకరణాంతమం దుదాహరించిన "శ్రీ స్తనాంచిత కస్తూరీ" యను శ్లోకము నాతని నిత్యానుసంధానపరాయణత్వము నుద్ఘోషించుచున్నది. పచ్చయప్ప యశోమండనమునఁగూడ శ్రీ వేంకటేశ్వరస్వామినే యాతఁడు ప్రశంసించియున్నాఁడు ఈవిధముగా గ్రంథప్రారంభమున దైవస్తుతి యొనరించు ప్రాచీనసంప్రాదయము ననుష్ఠించి నిర్మలుఁడైన భగవద్భక్తుఁడగు పండితాగ్రేసరుఁ డగుటంబట్టి పండితలోకమున పూజనీయుఁడై వెలుగొందినాఁడు.

పందొమ్మిదవ శతాబ్ది ప్రారంభమున ఆంగ్లేయుల పరి