పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


14. శిష్యవర్గము

చిన్నయసూరి తన కాలమునందే సమకాలిక పండిత వర్గముచే పండితమండలికెల్ల మకుటాయమానుఁడుగా పరిగణితుఁ డయ్యెను.

కాలము గడచినకొలఁది నీతనికి కొంత శిష్యవర్గము కూడ నేర్పడినది. వారిలో ప్రథములు ప్రఖ్యాతపండితులు బహుజనపల్లి సీతారామాచార్యులవారు (1827 - 1891), వీరు *[1] శబ్దరత్నాకరనిఘంటువునేకాక బాలవ్యాకరణమునకు శేషగ్రంథమగు ప్రౌఢవ్యాకరణ మను నొక వ్యాకరణమునుకూడ రచించియున్నారు. దీనికే త్రిలింగ లక్షణశేషమని నామాంతరము.

2. వైయాకరణము రామానుజాచార్యులు: ఈతఁడు గొప్ప సంస్కృతాంధ్రపండితుఁడు. చిన్నయసూరికిని వీరికిని ప్రథమ సమావేశము పచ్చయప్పవార్షికోత్సవసందర్భమున సంఘటించినది. అప్పుడు రచింపఁబడిన పద్యములలో సూరి పద్యములకే ప్రథమ సత్కారము కావింపఁబడినది. నాఁటి నుండియు నీతఁడు సూరి ప్రతిభ గుర్తించి యాతని గురువుగా నంగీకరించెను. ఈతఁడు పద్యరచన చేయుటయేకాక మహాభారతము ఆదిపర్వమునంతటిని వచనముగా రచించెను. అది క్రీ. శ. 1847 - వ సంవత్సరమున ముద్రితమైనది. ఒకవైపున

  1. * ఈ శబ్దరత్నాకర మిటీవల (1960) అనుబంధవిశేషములతో నా సంపాదకత్వమున ప్రకటితమైనది. (C. L. S., Madras).