పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 78

విభక్తి బోధిని

భాష నభ్యసించువారు తొలుత నక్షరములను, గుణింతములను నేర్చుకొందురు. ఆ వెనుక పదములు నేర్చుకొందురు. వీని రెండింటికొఱకు చిన్నయసూరి అక్షర గుచ్ఛమును రచించెను. ఇఁక పదములు నేర్చుకొన్న వెనుక నొక పదమునకు మఱియొక పదమునకుఁ గల సంబంధమును తెలిసికొనవలయును. దీనికొఱకు చిన్నయసూరి 'విభక్తి బోధిని' యను గ్రంథమును రచించెను. ఇది సంస్కృతమున శబ్దమంజరి ననుసరించి రచితమైనది. ఇందు తత్సమ శబ్దములకు, ఆచ్ఛిక శబ్దములకు ప్రథమాది సప్త విభక్తులయందు వచ్చు రూపములు చూపఁబడినవి. ఆ పైని సర్వ నామములకుఁగూడ సప్తవిభక్రి రూపములును కనఁబఱుపఁబడినవి. సంస్కృత భాషాభ్యాసకులకు శబ్దమంజరివలె నాంధ్రమున నిది విద్యార్థుల కత్యంతోపకారియై వెలయుచున్నది. దీనినికూడ పాఠశాలలయందు చాలకాలమువఱ కుపయోగించెడివారు. *[1] ఇది ప్రస్తుతము ప్రచారమున లేకున్నను మరల ప్రచారములోనికి తేఁదగినది.

  1. * ఏఁబదేండ్ల క్రిందట - నా చిన్నతనమున మా నాయనగా రీ 'విభక్తి బోధిని' ని శబ్దమంజరివలె వల్లింపఁజేసిరి.