పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 77

రణమునుబట్టి చక్కగా వ్రాయుటకును తెనుఁగు వ్రాఁతయందు తప్పులు లేకుండ నుండుటకును మిక్కిలి యుపకరించుచున్నది. గుణింత క్రమమునకు వీరు కొన్ని సూత్రములనుకూడ నచ్చటచ్చట రచించిరి. వ్యాకరణ సూత్రములుకూడ కొన్నింటి నచ్చటచ్చటఁ జేర్చిరి. ఇట్లు పదములు తెలిపిన వెనుక క్రియా రూపములు చెప్పఁబడినవి. ఇవి రెండువిధములుగా విభజింపఁబడి యున్నవి: 1. తత్సమ క్రియలు, లేక సంస్కృత సమక్రియలు, 2. వికృతి క్రియలు, లేక దేశ్యక్రియలు. సంస్కృత క్రియలలో ఇతంజంతములు, మతుబంతములు, ఇన్వంతములు, మత్వర్థీయములు, ఆల్వంతములు, భావప్రత్యయాంతములు, తవ్యాంతములు, అనీయంతములు, తుజంతములు, యుడంతములు మొదలగు వ్యాకరణ పారిభాషికము లనేకము లిందు తెలుపఁబడినవి. వికృతి రూపములకు భూత వర్తమాన భవిష్యదర్థక రూపములును చూపఁబడినవి. కేవలము బాలు రుచ్చరింపలేని కష్టతమమైన యుచ్చారణమును సులభ రీతిని గ్రహించుటకు నిందు ప్రయత్నము చేయఁబడియున్నది. ఇది యెంతయు శ్లాఘనీయమై యున్నది. నేఁటి స్వరశాస్త్ర పద్ధతులను, అనగా Phonetic laws ననుసరించి యిది విరచితమైనది. ఈ అక్షరగుచ్ఛము చదువుటచే సంస్కృతాంధ్రముల రెండింటిని చక్కఁగా నలవఱచుకొనవచ్చును. భాషాభ్యాసకులకు నిది ప్రథమ సోపానమువంటిది యని చెప్ప నొప్పును.