పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 76

మను నొక మహాకార్యమును చిన్నయసూరి మహాసమర్థతతో నిర్వహించి యాచంద్రార్కము తన నామము భాషా ప్రపంచమున ప్రకాశ వంతమగునట్లు నిలుపుకొనినాఁడు. భాషా పాండిత్యమునకు శబ్దశుద్ధి, శబ్దసిద్ధి ప్రధానములు. ఈ రెండు గుణములను సమ్మేళనముచేసి రచనలను గావించి కవులు శాశ్వతమగు కీర్తిని గడించుటకు మార్గదర్శకమైనది బాలవ్యాకరణము. ఇది భాషాకల్పకమునకు నిత్యపరిమళములను వెదజల్లు పారిజాతకుసుమమువలె సర్వకాలములను వాసింపఁగలదు. ఇట్టి రచనఁ గావించిన చిన్నయసూరి పాఠకలోకమునకు, పండిత లోకమునకు ప్రాత:సంస్మరణీయుఁడు గదా!

బాలవ్యాకరణమునే కాక, చిన్నయసూరి భాషాశాస్త్ర ప్రాథమిక విద్యా శిక్షణ కనుకూలమగు రచనలను కావించి యున్నాఁడు. అక్షరాభ్యాసము మొద లాంధ్ర వచన రచనా పరిణతికి నవి తోడ్పడునవి.

అక్షర గుచ్ఛము

బాలురు, బాలికలు ప్రథమమున భాష నేర్చుకొను నపుడు సరియగు వర్ణక్రమమును గుణితమును సక్రమరీతి నభ్యసింపఁజేయుటకై చిన్నయసూరి యకారాదిక్రమమున నీ యక్షర గుచ్ఛమును రచించి ప్రకటించెను. ఇదియును చాల కాలమువఱకు పాఠాశాలలలో ప్రాథమిక విద్యాభ్యాసవరుల కుపయుక్తమై యుండెడిది. ఇందు ముందుగా నచ్చులును, పిమ్మట హల్లులును, ఆ వెనుక నచ్చులతో కూడిన హల్లులు గల చిన్న పదములును తెలుపఁబడినవి. సంస్కృత పదముల యుచ్చా