పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 75

4. తెనుఁగువ్యాకరణమునకు శాస్త్రీయమగు వ్యాకరణ పరిభాష (Grammatical technique) యంతకుముందు లేదు. ఈవ్యాకరణమున ఆయాపరిభాషికపదములు సందర్భము ననుసరించి చక్కఁగా వ్యవహృతములైనవి.

5. ఇంతకుముందున్న వ్యాకరణములు కేవలము తెనుఁగుభాషా సంప్రదాయములను విపులముగా వివరించినవే కాని తెనుఁగునకు, సంస్కృతమునకుఁ గల యవినాభావసంబంధమును గుర్తించి రచితములు కాలేదు. ఇం దాసంబంధము తేట తెల్లముగా నిరూపితమైనది.

6. దీనికి పూర్వవ్యాకరణములు వ్యావహారికభాష నే ప్రధానముగా గ్రహించి వ్రాయఁబడినవి. బాలవ్యాకరణము పండితవ్యవహారమున నున్న గ్రాంథికభాషనే యాధారముగాఁ గొని రచింపఁబడినది.

7. ఈనాఁడు ప్రాచీనప్రయోగములను లక్ష్యలక్షణ సమన్వయము కావించుటకు బాలవ్యాకరణ మెంతో సహాయకారి యగుచున్నది.

8. ఇత:పూర్వవ్యాకరణములం దింత విశదముగ పరిచ్ఛేద విభాగముగాని, సూత్రముల పరస్పర సంబంధముగాని యెందును గానరాదు. దీనివలన వ్యాకరణము నభ్యసించు పాఠకుల -----ష్టమును గంభీరము నగు వ్యాకరణ విషయ మద్దమునందువలె స్వచ్ఛముగా కనఁబడుచున్నది.

ఆంధ్రవాఙ్మయమున నన్నయనాఁటినుండియు నే వ్యాకరణకర్తలును లాక్షణికులును సాధింపలేని వ్యాకరణ రచన