ఈ పుట ఆమోదించబడ్డది
చిన్నయసూరి జీవితము 73
బాలవ్యాకరణ వివరణము
బాలవ్యాకరణమున నీక్రిందిపరిచ్ఛేదములును, సూత్రములును గలవు: -
1. | సంజ్ఞాపరిచ్ఛేదము. ఈపరిచ్ఛేదమున వర్ణసమామ్నాయమును భాషావిభేదములును తెలుపఁ బడినవి. | సూత్రములు 23 |
2. | సంధిపరిచ్ఛేదము. ఇది సంధులనుగూర్చి తెలుపును. | సూత్రములు 55 |
3. | తత్సమపరిచ్ఛేదము. ఇది సంస్కృత సమములనుగూర్చి తెలుపును. | సూత్రములు 87 |
4. | ఆచ్ఛికపరిచ్ఛేదము. ఇది అచ్చ తెనుఁగు పదములఁగూర్చి తెలుపును. | సూత్రములు 38 |
5. | కారకపరిచ్ఛేదము. ఇందు విభక్తుల కొకదానికి, మరియొకదానికిఁ గల సంబంధము తెలుపఁ బడినది. | సూత్రములు 37 |
6. | సమాసపరిచ్ఛేదము. ఇందు సంస్కృతాచ్ఛికమిశ్ర సమాస భేదములు వివరింపఁబడినవి. | సూత్రములు 26 |
7. | తద్ధితపరిచ్ఛేదము. ఇది తెనుఁగున విశేష్యప్రత్యయములను తెలుపును. | సూత్రములు 28 |