పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 10

విద్వాంసుఁడు. ఆంధ్ర వాఙ్మయ చరిత్రమున నవీన యుగ ప్రారంభ దశలో, ననఁగా పందొమ్మిదవ శతాబ్ది ప్రారంభదశకమున చిన్నయసూరి ప్రభవించెను. అప్పుడే యాంగ్లేయులు మన దేశమున తమ ప్రభుత్వమును సుప్రతిష్ఠితము గావించుకొని తమ భాషయగు నింగ్లీషు భాషను రాజభాషగా నొనర్చి పరిపాలన ప్రారంభించిరి. పశ్చిమఖండవాసులైన యాంగ్లేయుల సమాగమమువలన వారి నాగరికత, సంస్కృతి దేశ భాషల కొక నూతన వికాసము గలుగఁజేసినవి, తెనుఁగున నవ్యయుగ చిహ్నములైన ముద్రా యంత్రములు, వార్తా పత్రికలు, విశ్వ విద్యాలయములు, వచన రచన, ప్రాచీన గ్రంథముద్రణము, భాండాగార స్థాపనము, భాషా వాఙ్మయ పరిశోధనము మున్నగునవి నాఁడే మొలకలెత్తినవి. వానికిఁ దగిన రీతిని దోహదము నిచ్చి యీ నవ్యయుగ నిర్మాణ సౌధమునకుఁ బునాదివైచినవారు భాషోద్ధారకులు బ్రౌను దొరవారు. వారి కాలమునందే చిన్నయసూరి కూలంకషమగు సంస్కృతాంధ్ర భాషా పాండిత్యము సంపాదించి యీ నూతనోద్యమము లన్నిటిని గ్రహించెను.

బ్రౌనుదొరవారి పద్ధతి యీకాలమున నాంధ్ర సారస్వతము నంతటిని నవీనరీతులను పునరుద్ధరించినదయ్యును, పండిత లోకమునకు నుపాదేయమగురీతిని పెంపొందలేకపోయినది. చిన్నయసూరి యీ నూతనపథకముయొక్క పరిస్థితిని గమనించి యది సంస్కరణార్హమని యెంచి యాయా శాఖ లన్నింటి యందు తాను పరిశ్రమచేసి యా నవీనపథకమును ప్రాచీన