పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 72

మును గూర్చి యొక వివాదము వెలువడినది. అది యేమన: చిన్నయసూరి కాలమున శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి యను నొక యుద్దండపండితుఁడు విలసిల్లియుండెను. ఆతఁడు 'హరికారిక' లను నొక సంస్కృత భాషలోనున్న తెనుఁగు వ్యాకరణ సూత్రములకు నొక వ్యాఖ్య రచించెననియు, నా వ్యాఖ్యనంతటిని సూరి తెనుఁగుభాషలో రచించెననునది. దీనికి వారు నుపపత్తి యేమనఁగా కృష్ణమూర్తిశాస్త్రి ప్రాచీన పండితుఁడై నవీనపథకములు తెలియనివాఁడగుటచే 'చందోయి' మొదలగు నుదాహరణములను తన వ్యాకరణములో నిచ్చె ననియు, సూరి నవీనకాలమున విద్యార్థులకు తగినట్టు లౌచిత్యమును పాటించి పాఠము చెప్పవలసినవాఁడగుటచే దానిని కందోయిగా మార్చెననియు నందురు. కాని సూరియే ఒకసూత్రమున యువతీవిటిరజస్వలల పేర్కొనుటచే నిట్టి మార్పు కావించియుండఁ డని మనము చెప్పఁగలుగుచున్నాము. ఈ వాదమునకు ముఖ్యులు కల్లూరి వెంకటరామశాస్త్రిగారు. వీరు గుప్తార్థప్రకాశికయందు పదునాలుగు యుక్తులను వివరించి యిది చిన్నయసూరి కృతము గాదనియు, కృష్ణమూర్తిశాస్త్రిగారి రచనమే యనియు సిద్ధాంతీకరించియున్నారు. ఈసిద్ధాంతమును పూర్తిగ ఖండితమైనది. *[1] కావున నిచ్చట నప్రస్తుతము.

  1. * ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక (1927) - ఆంధ్రవిశ్వకళాపరిషత్పండితులగు విద్వాన్ దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారి వ్యాసము.