పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 71

ముగా బాలురు కంఠస్థము చేయుటకు తగినట్లు రచించుటయే కారణము.

ముందు వివరించినట్లుగా బాలవ్యాకరణ రచనకు పూర్వము చిన్నయసూరి యభ్యాస రూపముగా చిన్న చిన్న వ్యాకరణ గ్రంథములను రచించియున్నాఁడు. సంపూర్ణ వ్యాకరణ సూత్రపరిణతికి నీ గ్రంథములు సోపానములవంటివి. వ్యాకరణమును పద్యములలో రచించిన వ్యర్థపదము లే వేవి తొలఁగింపవలసి యుండునో యవి కనుఁగొనవచ్చును. అందుచేతనే సూరి మొదట ఆంధ్రశబ్దానుశాసనమును పద్యములలో వ్రాయుటకుఁ గడంగెను. ఆ వ్యర్థ పదములను విసర్జించి వానిని కొన్ని చిన్న సూత్రములుగా శబ్దలక్షణ సంగ్రహమున రచించెను. వానిలో నేమేని దోషములున్నచో నవి తొలఁగి పోవుటకు వానిని సంస్కృత భాషలో రచించెను. ఈ సంస్కృత సూత్రములు తాను స్వయముగా రచించినవి కాఁబట్టియే బాలవ్యాకరణము చివర సూరి యిట్లు చెప్పియున్నాఁడు:

                "మును మదుపజ్ఞం బగుచును
                  తనరిన వ్యాకృతికి సూత్రతతి యొకకొంతం
                  దెనిఁగించి యిది ఘటించితి
                  ననయము బాలావబోధ మగుభంగిఁ దగన్."

ఇట్లు కంఠోక్తిగా సూరి బాలవ్యాకరణము తన స్వతంత్ర రచన యని చెప్పుచుండఁగా నీ తర్వాత నా రచన