ఈ పుట ఆమోదించబడ్డది
చిన్నయసూరి జీవితము 56
కథలు. | నీతులు. |
8. వ్యాఘ్ర జంబుకములు లొట్టియను కపటోపాయంబుచేత స్వామియను సింగంబుచే చంపించుట. | భృత్యులు మాయోపాయముచే నెట్టికార్యమునైన సాధింపఁగలరు. |
9. వడ్రంగి - సింహము కథ. | క్షుద్రజనపరివృత్తుం డగు రాజు సమాసన్న జనములకు ముప్పు పుట్టించును. |
10. టిట్టిభ సముద్రముల కథ. | హితవచనముల వినని పాలిశుఁడు నశించును. |
(అ) టిట్టిభి వాక్రుచ్చిన తామేటి - అంచల కథ. | హితవచనముల వినని పాలిశుఁడు నశించును. |
(ఆ) జలాశయ మందలి మూఁడు మత్స్యముల కథ. | మతిమంతుఁడు అనర్థము కలిగించు అభిజనమును మానుకొనవలయును. లేదా, యుపాయ సంపన్నుఁడై యుండవలెను; దైవపరుఁడై యుండరాదు. |
11. వానరములు - సూచీముఖము కథ. | మూర్ఖులకు బుద్ధిచెప్పుట హానికరము. |
12. నందనగుప్త సుదర్శనగుప్తుల కథ. | తన మేలు గోరి యితరులకు కీడు గోరువాఁడు తప్పక చెడిపోవును. |