పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 36

బాల్యమునుండి యహోరాత్రము లకుంఠితదీక్షతో నొనర్చిన భాషాపరిశ్రమచేతను, పాండితీగరిమచేతను, బోధనానుభవము చేతను, లక్ష్యలక్షణసమన్వయపరిజ్ఞానముచేతను, తన రచనలకు మెఱుఁగుపెట్టి, దిద్ది, తీర్చి సర్వాంగసంపన్నములుగా నొనర్చెను. దీనికితోడాతని యాత్మవిశ్వాసము, నాధ్యాత్మికపరిజ్ఞాన మాతని రచనల కొక సంపూర్ణత్వము సంపాదించినవి. విశ్వవిద్యాలయస్థాపనఫలితముగా ప్రాచ్యపాశ్చాత్యసంస్కృతుల సమ్మేళనమువలన నేర్పడిన నవీనయుగావిర్భావవికాసమునకు చిన్నయసూరి యెట్లు తోడ్పడెనో రాఁబోవుప్రకరణములఁ జదువుదము.