పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 34

ములను, లిఖిత పుస్తకములను తదేకధ్యానముతో పరిశీలించెడి వాఁడు. ఇంకొక విశేష మేమనఁగా, తాను చదివి గ్రహించిన విషయముల నప్పుడే వ్రాసి భద్రపఱచెడి పద్ధతి నాతఁ డవలబించెను. తాను పాఠము చెప్పెడు గ్రంథములలోని లోపములను కనిపెట్టి,, వాని నున్నతవిద్య కనుకూలమైనరీతిగ సంస్కరించు రచనలను కావించెడివాఁడు. ఈరీతిగా నొక పదియేండ్ల కాల మచ్చట పదవిని నిర్వహించెను.

మదరాసు విశ్వవిద్యాలయ స్థాపనము

ఇంతలో క్రీ. శ. 1857 - వ సంవత్సరము ప్రారంభ మయ్యెను. ఈస్టిండియాకంపెనీప్రభుత్వ మంతరించి దేశపరిపాలనము సామ్రాజ్యాధికారిణియగు విక్టోరియాచక్రవర్తిని హస్తగత మయ్యెను. దానితో విద్యాశాఖయందు నవీనపద్ధతులు పరిణతిఁ జెంద నారంభించినవి. ఆ సంవత్సరముననే యున్నతవిద్యలకు కేంద్ర మగు విశ్వవిద్యాలయము మదరాసున స్థాపితమయ్యెను. అందు ప్రవేశపరీక్ష (మెట్రిక్యులేషను), ప్రథమశాస్త్రీయపరీక్ష (ఎఫ్. యే.), పట్టపరీక్ష (బి. యే.) అను శాఖ లేర్పఱుపఁబడినవి. పాఠ్యభాగము లన్నియు నాంగ్లేయ భాషలో బోధింపఁబడుచుండెడివి. దేశభాషాపరిజ్ఞానముకూడ నావశ్యకమే కాఁబట్టి తెలుఁగు, తమిళము విద్యార్థులు పఠింప వలసిన నియమ మేర్పడినది. కాని ఇంగ్లీషు ప్రధానభాష; దేశభాషలు ద్వితీయభాషలు. ఇంతకుముందు దేశభాషలే ప్రధానముగా నుండి ఇంగ్లీషుభాష యుద్యోగనిర్వహణమునకు మాత్ర ముపయోగపడుచుండెడిది. విశ్వవిద్యాలయస్థాపనతో