పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 33

ఇంతలో సాయంకాలమయ్యెను. చీకటిపడఁ జొచ్చెను. కాలము నెవరు గమనింపకుండిరి. పనికత్తె దీపము వెలిఁగించెను. ఉపన్యాసము జరుగుచునే యుండెను. వినువారికి విసుగుపుట్టుట లేదు; కూర్చున్నవారు లేచుటలేదు; సభ్యులకు తనివి దీఱినట్లుగ లేదు. 'భోజన సమయ' మని సూపకారుని నివేదనమునుబట్టి కాలాతిక్రమణము నధ్యక్షులగు రంగనాథశాస్త్రులవారు గుర్తించిరి. సభామధ్యమున వారు లేచి, శ్రీసూరిగారియెడల తమ కిదివఱకున్న యభిప్రాయమును వదలుకొంటి మనియు, నానాఁటి యుపన్యాసముతో వారి పాండిత్యప్రకర్ష సర్వతో ముఖమైన దనిగ్రహించితి మనియు చెప్పి నాఁటి సభ ముగించిరి. తక్కిన పండితులుగూడ సూరిగారియం దానాఁటినుండి ద్వేష భావమును విడిచి మిక్కిలి గౌరవమర్యాదలతో ప్రవర్తింపఁ జొచ్చిరి.

సూరి దినచర్య

చిన్నయసూరి కళాశాలలో ప్రవేశించినదాదిగా నాతని దినచర్య యిట్లుండెను. అతఁడు తెల్లవాఱుఝామున లేచి కాలకృత్యములు నిర్వహించి మతసంప్రదాయికాచార నిష్ఠతో సాహిత్యవ్యాసంగము చేసెడివాఁడు. ఏదేని యొక విచిత్ర ప్రయోగమునుగాని, నూతనమైన పదములుగాని, విశేషముగల భాషాసంప్రదాయమునుగాని గ్రహింపకుండ నాతఁడు భోజనమునకు లేచెడివాఁడు కాఁడు. సకాలమునకు కళాశాలకు వెళ్లి పాఠములను బోధించెడివాఁడు. విరామకాలమునందు కళాశాలపుస్తకభాండాగారమున నున్న ప్రాచీనతాళపత్రగ్రంథ