పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 31

మాత్రము పుట్టుకచేత 'శాస్త్రి' నామమును ధరింతురు. అది వంశ పారంపర్యముగా వచ్చుచుండును. నియోగిశాఖలోని వారట్టి శాస్త్రి పదమును పండిత వృత్తిలోనున్నను ధరింపరు. కాని చిన్నయసూరికి ముందు ఫోర్టుసెంటుజార్జి కళాశాలలో పండితులై ప్రసిద్ధిచెందిన రావిపాటి గురుమూర్తిశాస్త్రిగా రాఱువేలనియోగి. అతఁడును కళాశాలా నిబంధనల ననుసరించి 'శాస్త్రి' యని వ్యవహరించుకొనెను.

చిన్నయ - 'సూరి' బిరుదము

చిన్నయసూరికిని ఉద్యోగములో ప్రవేశించునాఁటికి 'చిన్నయ' యనియే వ్యవహారము. ఒకనాఁ డార్బత్ నాటు దొరగా రాతనిఁ బిలిచి, "నీవు 'శాస్త్రి' యను నుపపదము నేల ధరింపలే"దని యడిగిరఁట. చిన్నయసూరి "అయ్యా! నేను పుట్టు శాస్త్రులను కాను; పెట్టు శాస్త్రులను కాను. కాఁబట్టి శాస్త్రినామమును ధరించుటకు జన్మముచే ననర్హుఁడను." అని జవాబిచ్చెను. "మఱి యేది పెట్టుకొనవచ్చు" నని దొరవారు తిరిగి ప్రశ్నించిరఁట. చిన్నయ 'సూరి' అను పదము నుపయోగింపవచ్చు నని సలహానిచ్చెను. అంతట నార్బత్ నాటుదొర యాంగ్లేయభాషలో 'చిన్నయ సూరి' అను నక్షరములతో చెక్కఁబడిన సువర్ణ హస్త కంకణమును సీమనుండి తెప్పించి యాతనిని బహూకరించెను. ఈ కంకణ ప్రదానము జరిగిన నాఁటనుండి 'చిన్నయ సూరి' అను వ్యవహారమే ప్రబలమైనది. ఇది యాతఁ డా కళాశాలలో ప్రవేశించిన కొంతకాలమునకు తర్వాత జరిగినది. ఏలయన, క్రీ. శ. 1847 లో నీతఁడును,