పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 27.

శాస్త్రమునందుకూడ వారు పరిశ్రమచేయుట యావశ్యక మైనది. పండితులుకూడ నా శాస్త్రమున ప్రావీణ్యము గలవారై యుండిరి. ఇట్టి పండితులలో మొదట నీ కళాశాల యందు తెలుఁగు భాషలో నియమితులైనవారు శ్రీ వేదము పట్టాభిరామశాస్త్రిగారు. వీరికి సహాయకారియగు పండితునిగా శ్రీ రావిపాటి గురుమూర్తిశాస్త్రి గారిని నియమించిరి. ఇందులో ప్రధాన పండితునికి నాకాలమున జీతము నెలకు నూటడెబ్బదియైదు రూప్యములు. ఆ కాలమున తెలుఁగు పండితునికి నూటడెబ్బదియైదు రూప్యముల జీతము ననుసరించినచో నీకాలమున 1400 రూప్యముల వేతనము నియ్యవలసి యుండెను. దీనినిబట్టి యా కాలమున నాపదవి కెంత గౌరవ ముండెడిదో తెలియచున్నదికదా!

పట్టాభిరామశాస్త్రిగారు 1816 వ సం.లో తెనుఁగున పద్యాంధ్రవ్యాకరణమును 'పట్టాభిరామ పండితీయ' మను పేరున రచించిరి. మఱియు 'ధాతుమాల' యను గ్రంథమును రచించిరి. ఇవి రెండును ముద్రితములు. గురుమూర్తిశాస్త్రిగారు క్రీ. శ. 1836 వ సంవత్సరమున నొక విపులమగు తెనుఁగు వ్యాకరణమును రచించి యానాఁడే ముద్రించిరి. ఈ వ్యాకరణ గ్రంథములు చిన్నయసూరి బాలవ్యాకరణ రచనమునకు నెట్లు మార్గదర్శకములైనవో రాఁబోవు ప్రకరణములలో చదువుదము.

గురుమూర్తిశాస్త్రిగారు క్రీ. శ. 1837 లో చనిపోయిరి. వీరి వెనుక పుదూరి సీతారామశాస్త్రులవా రా