పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 25.

పద్య రచనయందేకాక పాఠములు చెప్పుటయందును చిన్నయసూరి మిగుల శ్రద్ధవహించి ప్రాచీన సాహిత్యము నందలి కేవల వ్యాకరణచ్ఛందోలంకార విషయములేకాక మూల కథా విన్యాసము. అర్థసంగ్రహము, మనోహరశైలి, లక్ష్య లక్షణ సమన్వయము మున్నగువానిని గూర్చి విద్యార్థులకు సుగమముగా నుండునట్లు బోధించెడివాఁడు. తానుకూడ నొక విద్యార్థివలె రేయింబవళ్ళు పరిశ్రమచేయుచు తనయొద్ద చదివిన శిష్యులను తన్ను మించినవారినిఁగా చేయుటకు ప్రయత్నించెడివాఁడు. ఇట్టి యున్న తాశయములతో నున్నత విద్య నేర్పిన చిన్నయసూరివంటి పండితుఁడు నేఁటి యధ్యాపక బృందమున కాదర్శప్రాయుఁడుగదా!