పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 24

గేండ్లు పనిచేసినట్లుగా నా పాఠశాల సాంవత్సరిక నివేదికలు తెలుపుచున్నవి.

అచ్చట పండిత పదవి నిర్వహించుటయేకాక యాతఁడు గ్రంథ రచనను చేయుచుండెడివాఁడు. ఆ కాలమున పాఠశాలా వార్షికోత్సవములయందు పచ్చయప్ప మొదలియారినిఁ గూర్చి పండితులు పద్యములు, శ్లోకములు వ్రాయుచుండెడివారు. అందు పాల్గొని చిన్నయసూరి తెనుఁగు పద్యములేకాక సంస్కృత శ్లోకములు వ్రాసియున్నాఁడు.*[1] ఆ పద్యములలో సభలో మెప్పుగొన్నకొన్నింటుకి పారితోషికములుకూడ నిచ్చెడివారు. అట్టి పారితోషికములు చిన్నయసూరియే ప్రతి సంవత్సరమును తప్పక పొందెడివాఁడు. అందుచేత సమకాలికులకు, సహాధ్యాయులకు నీతనిపై నీర్ష్యాభావ మంకురించినది. పైఁగా చిన్నయసూరి బ్రాహ్మేణేతర కులమునకుఁ జెందిన సాతాని వైష్ణవుఁడగుటచే కేవలము విశిష్టాద్వైత సంప్రదాయమును పాటించు వైష్ణవ పండితులును. నితర స్మార్త పండితులునుగూడ చిన్నయసూరి నిత్యానుష్ఠానపరత్వము, నియమ విశేషము గ్రహింపకయే ద్వేషింపసాగిరి. చిన్నయసూరి కవితాకమనీయతను గూర్చి యాతని పద్య రచనలు అను శీర్షిక చూడనగును.

  1. * 'పచ్చయప్పను' గూర్చిన ప్రశంసా పద్యములు, సంస్కృత శ్లోకములు 'పచ్చయప్ప యశోనృప మండసము' అను పేర గ్రంథ రూపమున ప్రకటితమైనవి.