పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 23

ఇంతలో చిన్నయసూరిజీవితములోని యుచ్చదశ ప్రారంభమగుట కనువగు పరిస్థితి యేర్పడినది. దానకర్ణుఁ డని ప్రసిద్ధిఁ జెందిన పచ్చయప్ప మొదలిపేర స్థాపించిన విద్యాసంస్థ యందు పండితుఁ డొకఁడు కావలసివచ్చెను. అప్పటికీ విద్యా సంస్థకు నధికారవర్గ మొకటి యేర్పడియుండెను. దాని కధ్యక్షులు శ్రీ కోమలేశ్వరపురపు శ్రీనివాసపిళ్ళెగారు. వారు పుట్టుకచే తమిళులయ్యును తెనుఁగుభాషయం దత్యంతాదరాభిమానములు గలవారు. వారు చిన్నయసూరికిఁగల యాంధ్ర భాషాపాండిత్యము తొలుతనే గుర్తించినవారగుటచేత నాతని పిలిపించి పచ్చయప్ప పాఠశాలయందు పండితపదవి నొసఁగిరి. ఇది క్రీ. శ. 1844 - వ సంవత్సరప్రారంభమున జరిగినది.

ఆకాలమునాఁటికి మదరాసు విశ్వవిద్యాలయ మేర్పడక పోవుటచే నున్నతపాఠశాల లనుపేర మూఁడుపాఠాశాలలు మాత్రమే చెన్నపురమున నుండెడివి. అవి 1. రాజధాని యున్నత పాఠశాల, 2. పచ్చయప్ప యున్నతపాఠశాల, 3. క్రైస్తవోన్నతపాఠశాల. ఇచ్చట నున్నతవిద్య గఱపఁబడుటచే వీని కాపేరు వచ్చినది. ఆనాఁ డున్నతవిద్య యనఁగా నేఁటి కళాశాలలలోఁ గఱపఁబడు పట్టపరీక్షాదివిద్యలని యెఱుఁగఁదగినది. విశ్వవిద్యాలయ స్థాపనమైన వెనుక కళాశాలల స్థాపనకూడ జరిగినది. నాఁటినుండి కళాశాలా విద్యల కున్నత పాఠశాలలు సోపానములైనవి. ఆ పాఠాశాలయందు చిన్నయసూరి నాలు