పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 21.

తెనుఁగుపాఠములు చెప్పించుకొనుచుండిరి. సాహిత్యవిద్యయం దనుపమానపాండిత్యము కలవాఁడగుటచే చిన్నయసూరివద్ద పెక్కుమంది విద్యార్థులు పాఠములు నేర్చుకొని పండితపరీక్షలకు వెళ్లెడివారు. ఆ పరీక్షలలో తక్కిన గురువులవద్ద నేర్చినవారి కన్న చిన్నయశిష్యులు ప్రతిపరీక్షయందును ప్రథములుగా నుత్తీర్ణు లగుచుండిరి. దీనిచేత నీతని కీర్తిచంద్రికలు చెన్నపురిలో నలుదెసల వ్యాపింపఁజొచ్చినవి. ఈతని పాండిత్య ప్రతిభ, బోధనాశక్తి, విషయవైశద్యము, విచక్షణపరిజ్ఞానము నాకాలమందలి పండితమండలినేకాక పురప్రముఖలలో ముఖ్యు లగు శ్రీ గాజుల లక్ష్మీనరసింహముశ్రేష్ఠి, న్యాయాధిపతి కలుసలపల్లి రంగనాథ శాస్త్రి. పచ్చయప్పధర్మసంస్థ ప్రధానాధికారి కోమలేశ్వరపురపు శ్రీనివాసపిళ్ళె మున్నగు వారల నాకర్షించి ముగ్ధులను గావించినది. ఆ కాలమునందు చెన్నపురిలో జరుగు పండిత సభలకుఁగూడ నీతని నాహ్వానించు చుండెడివారు.