పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 20.

నట్లుగాక నికరమును, నిర్దుష్టమును, నిరవద్యమును నగు పాండిత్యము పండఁబాఱినవెనుకఁగాని చిన్నయసూరి గ్రంథరచన కుపక్రమింపలేదు. విద్యాపరిజ్ఞానముతోఁగూడ ననుభవమును మేళవించి గ్రంథరచన ప్రారంభించుటచే నీతని గ్రంథము లుత్కృష్టములై యలరారుచున్నవి.

ఇట్లుండఁగా క్రీ. శ. 1836 - వ సంవత్సరమున వీరి తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులవారు కాలగతి నొందిరి. అప్పటికి వారి వయస్సు నూటపది సంవత్సరములు. సుప్రీముకోర్టున న్యాయాధిపతిగనున్న తండ్రి కాలధర్మమునొందుటచే సంసారభారమంతయు చిన్నయసూరిపైఁ బడెను. వెంటనే యుద్యోగప్రయత్నముచేసినను లభ్యము కాకపోవుటచే కొంతకాలము వీరి కుటుంబమునకు భోజనవసతులుకూడ సరిగా లభింపని పరిస్థితు లేర్పడెను. చిన్నయసూరి యట్టి క్లిష్టపరిస్థితులలోకూడ తన సాహిత్యవిద్యాపరిశ్రమను సాగించుచు కుటుంబభారమును నిర్వహించెను. ఇది సులభసాధ్యమైన పని గాదు. కాని చిన్నయసూరి దైవభక్తిపరాయణుఁ డగుటచే నీ విపదంభోధి నెదుర్కొని యచిరకాలములోనే దానిని తరింపఁగలిగెను.

ఆతని యదృష్టవశమున చెన్నపురియందలి 'ఆప్టను' మిషను పాఠశాలయందు కొలఁదివేతనముపై నొక యుపాధ్యాయపదవి లభించెను. ఇంతేకాక యీతని కాంగ్ల భాషాపరిజ్ఞాన ముండుటచే కొందఱు క్రైస్తవమతాచార్యు లీతనివద్ద