పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 16.

రించి సంస్కృ తాంధ్ర భాషల రెండింటిని చదువ మొదలిడెను. మొదట బాలరామాయణమును, అమరమును, ఆంధ్రనామ సంగ్రహమును వల్లెవేసెను. అతఁ డేకసంథాగ్రాహి యగుటచే వానినన్నింటిని కొలఁదికాలములోనే హృదయంగతము కావించుకొన్నాఁడు. కొంతకాలమునకు తండ్రి యీతనిని పరీక్షింపఁదలఁచి పిలిపించి అమరమున కొన్నిప్రశ్నలను వేసినాఁడు. చిన్నయ ఝటితిస్ఫూర్తితో జవాబిచ్చి తండ్రిని సంతోషాంబుధి నోలలాడించినాఁడు. తన కుమారుఁ డింక సాహిత్యమును చదువ నక్కఱలేదనియు, శాస్త్రమువైపు నాతని దృష్టి ప్రసరింపఁ జేయవలయు ననియు, ముఖ్యముగా వ్యాకరణశాస్త్రము నభ్యసించవలసినదనియు బోధించి ఆతఁడు తానే యా వ్యాకరణవిద్యఁ గఱపుటకు పూనుకొనెను. కాని యింతలో చిన్నయతండ్రికి మదరాసునందు 'ఈస్టిండియా కంపెనీ' వారి *[1]సుప్రీముకోర్టున న్యాయశాస్త్రవేత్తగా నుద్యోగ మయ్యెను. దీనికి కారకు లా కాలమందు మదరాసుపుర ప్రముఖులలో ప్రథమగణ్యులగు గాజుల లక్ష్మీనరసింహము.

చెన్నపురి నివాసము

తండ్రిగారితో చిన్నయసూరి చెన్నపురికి వచ్చి వ్యాకరణము మాత్రమేకాక, అరవము, తెనుఁగు, ప్రాకృతము మొద

  1. * ఆ కాలమున, ననఁగా కంపెనీవారి ప్రభుత్వకాలమున నేఁటి హైకోర్టును 'సుప్రీముకోర్టు' అని వ్యవహరించెడివారు.