పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రముల యుత్పత్తి క్రమము 11

సిద్ధాంతమం దీ సంప్రదాయములకుఁ బరస్పర భేదమంతగా లేదు. గౌడసంప్రదాయమందు మాత్రము సిద్ధాంత భేదము లనేకములు పుట్టినవి. ముఖ్యముగా దాయభాగమందు విశేష భేద మేర్పడియున్నది. (మార్లి 1, అవ. 189-191)

కాశీ
బంగాళ
సంప్రదా
యములు.

5. కాశీ సంప్రదాయము తక్కిన మూఁడు సంప్రదాయములకు మూలము. కావున ధర్మశాస్త్ర వ్యాఖ్యాతలు కాశీ సంప్రదాయమువారని బంగాళ సంప్రదాయమువారని రెండు గొప్ప తెగలవారు. బంగాళ సంప్రదాయమందు ధర్మశాస్త్రార్థములు యుక్తివాదములచేత దిద్దుబాటు గలిగియున్నవి. కాశీ సంప్రదాయమందు మూలార్థమే కేవల మనుసరింపబడుచున్నది. (1. 316, 317 కో)


ద్రవిడ
సంప్రదా
యమందు
ముఖ్య గ్రం
ధములు

6. ఇటమీఁదఁ జెప్పెడు గ్రంథములు ద్రవిడ సంప్రదాయమందు ముఖ్యప్రమాణములు. వానిలోఁ జెప్పిన యాచారములే యీ గ్రంథమందుఁ జెప్పఁ బడును.





(1) మితాక్షర-ఈ గ్రంథము విజ్ఞానేశ్వర యోగిచేత రచియింపఁ బడినది గనుక విజ్ఞానేశ్వరీయ మనియును వాడఁబడును. ఇది యాజ్ఞ వల్క్య స్మృతికి వ్యాఖ్యానము. ఇం దితర స్మృతివచనము లుదాహరింపఁబడి యున్నవి. దీనియం దాచార కాండము వ్యవహార కాండము ప్రాయశ్చిత్తకాండమని మూఁడు