పుట:2015.396258.Vyasavali.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

75

ప్రాదెనుగు గమ్మ

గదలాడుచు, బురపుర బొక్కచు, జాలి గూయిడుచు, బడలు సాలగబది వనరుచు నుండ్రట! కటకటా! యేలాకో యురయుడయ్య! "తెన్నటి కాపుల ప్రొదెన్గు ముత్తవ్వ ముదిసియు జివికియు బరిసె గాన నెండు డొక్కును బూడ్చియిక దప్పదగు దాని; నెల్లరు వలయు గ్రొమ్ముద్దియ గొల్వ"నని తూటలనిరట చెవి నూడుగాను! బెద్దయం బ్రొద్దయ్య; బెద్దముత్తయిదువ. నాలాయమున కింతవగగుంద నేల? పలుకు ముత్తవ లెల్ల రనటుల వోలె బిల్లల గన లావు కాకువోరె?

   తెనుగు నాటను గల పెక్కూరుపల్లెలు వేరులు మాఱియ దనరునిపుడు. దొంటి పేరులు గొన్ని రాగి పట్టాల, ఱాలపై గానంగ నయ్యెడు గాదె? ప్రాత యక్కరములు సదువంగ నేర్చిన యయ్యలు సెప్పగల వాని నేర్చి, యిపుడు పేర్కొన్నచో దెలియబడునె యా యూళ్ళవారికేన్? బొత్తములనున్న యిప్పటి పేళ్ళవి గ్రొత్తవిగావున దప్పని వానిని ద్రోచి పుచ్చి, ప్రాత పేరులు నేర్చి మగుడ నచ్చొత్తి, బడుల బిడ్డలచేత జదివింపమేలె? యొకయూరి గామిడికి గమ్మెండు గిచ్చి, కమ్మపై బ్రానుడివ్రాసి యంపెదరె?  "యంచెల" వారది యంచి పుచ్చుదురె? లెంకనొక్కని జీరి, ప్రాత పేరది సెప్పి, యొక యూరికేగంగ బనుచుడు, వాడు "నేనెఱుగ నదియేటి దేడనున్న" నడె? క్రొన్నుడి ముతకని నేటి పేర్వులుగ మీనాల్క యీకొనమి, మొదలమేల్ నుడియ పల్కి, వెంబడి వీరు పని సక్క నెఱవెఱ గ్రొన్నుడియు దెల్లముగ వాక్రువ్వవలయు; బ్రానుడి పద్దెంబు మున్నగా జదివి, పదపడిదేటగా గ్రొందెల్గు పల్కునయ్య నారట్టుల; మేలు నూరె! సుంకరు 'లంచెల ' యెకి మీడు, రచ్చతెర్పర్లు, గాపర్లు, బడి యయ్యవాండ్రు సుద్దిగా నూళుల ప్రాతపేరులను నేర్వంగ గాట్టడి సేయుమని ఱేని వేడంగ వలయును జుండి తడయకయు. ప్రాబొత్తములు మీకు దొరకొన్నవటె గొన్ని. యందుల ప్రానుడులు మన