పుట:2015.396258.Vyasavali.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

67

ప్రాదెనుగు గమ్మ

పనులు సేయుడును, బిన్నలు నేర్తురు వారలయు నుడుల నొండొడ్ల తలపులు నొండొడ్లు నెఱుగంగ నిదియ యెల్లెడ మేటిపాడిగాదె! పలుగొలములను బుట్టు బిడ్డలు బడులలో బెద్దలనుండి నేర్చి యలవర్చుకొనరె? బడులలో నొజ్జలు పెద్దలతోగూడి మెలగుడు, వారల యాడుబాస గఱతురు; నేర్తురును గఱపంగ నొడ్లకు. బాసల గానిండు, వెఱలు గానిండు; చదువు మెఱగులు గల్గు పెద్దలబాస వీరు వారును నాక యెల్లరికి దెలియ గాపులకేనియు మాలలకేని. పెద్దలనుడులగుట మెత్తురెల్లరును; వలతురు నేర్వంగ నెల్లరువాని; జుల్కగా నేర్వంగ నెల్లరువాని; జుల్కనగా నేర్వంగ నోపుడు రెల్ల, సాజంపు వరుసను, వీనులవినియు, నోటను బలుమఱు బల్కిపల్కి యిదియ కదె యెల్లెడల బాడి బాసలకు? నిట్లుగా బిన్నలు సన్న లెల్లరును బొందుగా బెద్దల నుడుల నుడువంగ బొందుగా బెద్దలమదుల వ్రాయంగ; నోటి మాటలు, నేతి వ్రాలును గమ్మ చదువులు, నొక్కమెయి సమకూడియుండ; మఱియేమి గల దయ్య మనకు జెప్ప? విద్దె యెల్లడ నలమికొని యొసక మొసగు. నిదియు నుడి పెఱనాట్లు బాడి చదువులకు. వినరకోయీమాట మీరలెన్నడును? బడియొజ్జ నాలుక పలికిన పలుకులు సెవి మెచ్చి సరియను, గండ్లు దప్పనగ గన్నులు బాసకు బెదనెల లొక్కొ? యీతెనుగునాటను ననునంటి వార యేడ జూచిన నుందు రొజ్జలనుపేరం (బొట్టకూటికనుండు, త్సప్పేమి దాన్?) వీర కదె వేనవేల్ విల్లలచేత బడులలో జదువులు సదివించుట? మీమెచ్చు ప్రాదెనుగు నేర్వంగ నగునె యీయయ్యవాండ్రకు నేరికి నేని? (నొకరిద్దఱుండ్రునో నేర్చినవారు; గడనయె వార లీ మొత్తమ్ములోన?) మనతెలుగువారట్టె యిన్నూఱు "లచ్చ" లయ్యును, నూర్వురకెనమండ్రయేని దమ పేరు వ్రాయంగ నేర నయ్యెదరు. అక్కరాల్ నేర్చిన వారిలొ నేని, వేయింట గాదునో, పదివేలలోన బ్రాదెనుగు జదువుగల డొకడేని యున్నె? ప్రాదెను గేదనేన్ బలుక