పుట:2015.396258.Vyasavali.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
66

వ్యాసావళి

   అట్లుండెనది; వినుడు నానిచ్చునది యింక. మూడు కాళుల తనరు దాబట్టినట్టి కుందేటికనుమాడ్కి బంతము విడిచి, కీడు మేలరయుడు గినుక దక్కి. బాసన్నదేప్రొద్దు. నాలుకమీద నాడుచు బాడుచు నలరును గాదె? ప్రాతకమ్మల గ్రుయ్యబాసయు బాసె? యేనాటికేని యును నున్నె యీమద్ది? మననాట నీమాట సెల్లెగాక. సజలనాలుక దొఱగి, యెండు డొక్కలు గానె? పొత్తములన్నియు బ్రోనెత్తి యేర్చినన్ గ్రొందెనుగు సావద. పడుగల్గి పచ్చగా మిసిమిసిలాడుచు నివురించి విరియును,. గాచును, బండు; విత్తులు వెదజల్లి  కొలము పెంపొనగూర్చు దాన మాఱి. యనురును, బసయును గల యట్టివెల్లను మాఱకుండగ బోవకుండగాద, "దేశభాష" యు "మాతృభాష" యటంచు బొగడెదరూరక బూతులువోలె మీమెచ్చుప్రాదెనుగె "దేశభాష"? మీమెచ్చుప్రాదెనుగె "మాతృభాష" యేదేశమున వారు మీమెచ్చు తెనుగును నోటనుబల్కువా రరసిచెపుడ. ఎయ్యేని "దేశము"ను జనులు నుడువనిది "దేశభాష" యటంచు బేర్కొనబడెనె? ప్రాతకమ్మల నుడులు నాపనికి నుగ్గుతో నే "మాత" యను బోయ గని యెఱుగ మయ్య మాటన్న, బలుకన్న, నుడియన్న, నేమి? సదువన్న, బాటన్న, బాసన్న, నేమి? నాకు మీతలపులు దెలిపెడు నులివు; మీ నాత రెలలి నా వీనుల కెక్క జేతులగివ్వంగ గన్నులన పడునది బాసయె? యదిబాసజాడగాక. యెయ్యేని నాటను నెయ్యేని బెద్దలెయ్యేని చొప్పున మాటలాడెదరు. నలుగురికి నానాట నదియు చొప్పడును. బిడ్డలింటింటను దలిదండ్రులాడు మాటల నేర్తురు గూడియుండుటకు. దల్లియు  దండ్రియు మొఱటులయిరేని, బిడ్డలమాటలును మొఱటులయగును. పెద్దల బిడ్డలతో గూడి యాడు పిన్నల బిడ్దలును మేల్నుడియనేర్త్రు. పెద్దలతో గలసి