పుట:2015.396258.Vyasavali.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54

వ్యాసావళి

మునకు పూనుకోవలెను. ఆపనికి తాటాకుపుస్తకము లున్నుశాసనములున్ను అవశ్యకమయిన సామగ్రి- పరమాధారము. అవి మార్చివేస్తే ఇంతంతని చెప్పరాని కీడుకలుగుతుంది. మార్చేవారికిదురుద్దేశములేకపోవ చ్చును. మార్పులవల్ల సత్యము మరుగుపడుట సంభవించవచ్చునుగనుక, ఉద్దేశము మంచిదే అయినా ఆపని అనర్దకము.

     "పూర్వలిపిని బాగుగ జదువలేకపోవుటచేత గాని శాసనముల గ్రమముగ సమన్యయించుకొనలేక పోవుటచేతగాని కొందఱపార్దములు చేసికొని వానిని సిద్ధాంతములుగా బ్రకటించురనుటకిదియొక దృష్టాంత ముగా గ్రహింపవచ్చును." అవిమనపంతులవారు తమకు పుల్లరిబోడు మీదనున్న శాసనమును కనపర్చిన చిలకా వేంకటకృష్ణముయ్యగా రన్నమాటను పట్టి హితోపదేశముచేసినారు. వేంకటకృష్ణయ్యగారు ప్రాచీనలిపి తెలియక, "దల్లి సూరాంబచే" అనిశాసనములో ఉంటె "డిల్లిసూరంబాధా" అనిచదువుకొని శాసనములో డిల్లీ  సూరంభాకున్ను కొండవీటి రెడ్లకున్ను జరిగిన యుద్ధము వర్ణించబడినదని చెప్పినారట! (ఆం.సా. పత్ర్రిక.204) ఇట్లే "మల్లియరేచ" అనేశబ్దము బ్రౌన్ దొరగారిపండితులు సంప్రదాయమెఱుగక "మల్లయరేచ" అని దిద్దినారని పంతులవారే ఆక్షేపించినారు (చూ.ఆం.సా.పత్రిక. V.ఉ) ఇట్లు ఇతరుల అవివేకమును ఉద్ఘోషించి గ్రంధకర్తపరిష్కర్తల కుచితధర్మముపదేశించిన పంతులవారు స్ఫయముగా పరిష్కరించిన శాసనములలోని మూల గ్రంధమందు చేసిన మార్పులుచూస్తే , "శాసనాత్ కరణంశ్రేయ:," అన్ననీతి జ్ఞప్తికివచ్చినది.
   పంతులవారు ప్రకటించిన ప్రాచీనశాసనములలోని గ్రంధము మూలమునకు విరుద్ధముగా పరిష్కరించుట మిక్కిలి శోచనీయముగా ఉన్నది. యుద్దమల్లుని శాసనము, ఓపిలిసిద్దిరాజు కొణిదెన శాసనము, శ్రీనాధుని కృతులయిఅ కొండవీటి రెడ్డినాటి శాసనములు ప్రాచీనాంధ్రభాషాస్వరూప