పుట:2015.396258.Vyasavali.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
50

వ్యాసావళి

కున్న నన్నయలిపిలో భేదము స్పస్టముగా కనబడుచున్నది. ఆరవ వాక్యములో "కుట్రున" అని పంతులవారు పఠించినట్లే కీల్ హర్ న్ గారు కూడ పఠించినారు. ప్రతిబింబములో ఈభేదము ప్రాచీనలిపి తెలియనివారికయిన కనబడుతుంది. ఇంత స్పష్టమయిన అక్షరమును సరిగాపోల్చుకోకుండా కొమ్ములేనిచోటకొమ్ముకనబడేటట్లుగా దృష్టిదోషము కలుగజేసి పంతులుగారివంటివారిచేత కూటకరణము చేయించినదేమిటి? లోకమందు సుప్రసిద్ధముగా ఆబాలగోపాలము అందరికీతెలిసిఉన్న "ఱేపు" శబ్దము ఱేపశ్యమని తోచునట్లు భ్రమపుట్టించి దానికి "సమూహ" మని అపార్దముకల్పించేటట్టుచేసిన అవిమర్శపూర్వకసిద్ధాంతమే-అవధారణార్దకమయిన ఆకారము ఈశబ్దములకు పరమందుండుట సమంజసముకాదనుకోవడమే'

    పంతులవారి విమర్శనములో మరియొక చిత్రమైన విశేషమున్నది. అర్వాచీనుల భాషలొని శబ్దముయొక్క రూపమునుపట్టి వ్యుత్పత్తి కల్పించి, ఆవ్యుత్పత్తి ప్రమాణముగా గ్రహించి, ప్రాచీనుల భాషలోని శబ్దముయొక్క రూపము తద్భిన్నముగా నున్నదని తప్పుపట్టి దిద్దుటకు సాహసించినారు. భాషాతత్వజిజ్ఞాసకు దురబిమానముగాని పక్షపాతముగాని ప్రతికూలముగా ఉంటుంది. మన వ్యవహారములో ఇప్పుడు "పొలిమేర" అనే శబ్దమున్నది; కాని "పొలమేర"  లేదు. శబ్దరత్నాకర మందు మొదటిదిమాత్రమే కనబడుతున్నది; అందు "గ్రామద్వయమధ్యసీమ" 'ఎల్లా అని అర్దములున్నవి; కాని ప్రయోగములు లేవు. కాశీఖండమందు (వావిళ్ళవారి అచ్చుపుస్తకము 111, 116) సీసగీతిలొ ప్రయోగము "పోలిమేరసీమ"  అనిఉన్నదని నేను జ్ఞాపకము పెట్టుకొనిఉన్నాను. అయితే, లాక్షణికులు అంగీకరించదగిన స్దలములొ అనగా యతిస్దానమందు "లి" వర్ణములేదు. శ్రీనాధుడు "పొలమేర" అని వ్రాసినాడో దీనిని బట్టి తేలదు. ప్రాచీనప్రతులలో "పొలమేర"  అనిఉన్నా అర్వాచీన