పుట:2015.396258.Vyasavali.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

44 వ్యాసావళి శబ్దములు ప్రయోగించినపుడు నన్న యాది ప్రాచీనక వులెవరైనా ఎక్కడైనా ఈశబ్దములు వాడినారు గాబోలును, ఏవ్యాకరణములో నైనా వీటికి అను శాసనమున్నది గాబోలును అని చదువరులు అనుకొంటారుగాని తప్పనుటకు సాహసిస్తారా? నావంటివాళ్ళుమాత్రము వీటిసాధుత్వము అంగీకరించుటకు పూర్వము మాణము చూపించవలెనని ప్రయోగించిన కవులను కోరుతారు. వ్యావహారిక భాషలోని శబ్దములకు వ్యవహార మే ప్రమాణము. దానికీవిర:ద్ధ మైన శబ్దములకు ప్రాచీన గ్రంధములలోని ప్రయోగము లే ప్రమాణము. ఆ ప్రయోగములను అనుసరించి చేసిన అనుశాసనము చెల్లుతుంది. అపశబ్దములు (అనగా ఇప్పటి వ్యవహారములోని ప్రాచీనుల గ్రంధములలో గాని లేనివి) అనుశాసించుటకు ఏలాక్షణికునికీన్ని అధికారము లేదు. నన్నయభారతములో కనబడే భాషానియమములు తెలుసుకో కుండా పాఠములమార్చి అపశబ్దములున్ను అర్వాచీనాంధ్ర భాషాశబ్దము లున్న నన్నయ భాషలో చేర్చి ఊరూ పేరూ తెలియని పరిష్కర్తలు ప్రాచీ సాంధ్రభాష పాడు చేసినారు. తత్త్వా న్వేషణపరులు శ్రమపడి ప్రాచీన ప్రతులు సంప్రతించి శుద్దమయిన పొఠ ములతో భారతము తీరిగీ అచ్చు వేయి స్తే నేకాని, రాజరాజు కాలమందున్న గాంధి కాంధ్ర భాషాలకణము నిరూ పించుటకు ఎవరున్ను పూనుకో లేరు. అంతవరకున్ను చేసే ప్రయత్నములు సఫలము కావు. అసత్యము సిద్ధాంతము చేసుకొని దుష్టలక్షణము ప్రమాణము గా గ్రహించి, దురభిమానము, దురాగ్రహము గలిగి, భాషాతత్త్వ మేకాదు, దేనితత్త్వమైనా తెలిసికొ"నుటకు ప్రయత్నించుట అనర్థకము. అట్టి ప్రయ త్నము చే నేవారికీ దురుద్దేశమున్నదని వారిమీద ఆనింద ఆరోపించ కూడదు. సదుద్దేశముతోనే ఇట్టివారు (ఇతరవిషయములలో అత్యుత్త ములు కావచ్చును). చేసేపనివల్ల తత్త్వము ఆడుగంటి లోక మునక కీడు